ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా జీవిత చరమాంకం అసోంకు అంకితం : రతన్ టాటా

ABN, First Publish Date - 2022-04-29T21:28:18+05:30

దిస్పూర్ : భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త Ratan Tata ఆసక్తికర ప్రకటన చేశారు. తన జీవిత చరమాంకాన్ని ఈశాన్య రాష్ట్రమైన assamకు అంకితం చేస్తానని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిస్పూర్ : భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త Ratan Tata ఆసక్తికర ప్రకటన చేశారు.  తన జీవిత చరమాంకాన్ని ఈశాన్య రాష్ట్రమైన assamకు అంకితం చేస్తానని అన్నారు. అసోంను విశేషమైన, అందరూ గుర్తించగలిగే రాష్ట్రంగా తీర్చదిద్దడంలో తనవంతు సహకారం అందిస్తానని ఆయన చెప్పారు. గురువారం అసోంలో 7 అధునాతన cancer hospitalsను ప్రారంభించిన కార్యక్రమంలో pm narendra modiతో రతన్ టాటా కూడా పాల్గొన్నారు. వీరివురూ మరో 7 క్యాన్సర్ హాస్పిటల్స్‌కు శంకుస్థాపన కూడా చేశారు. ఈ సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ.. తన జీవిత చరమాంకాన్ని అసోంకు అంకితం చేస్తానని అన్నారు. అసోం చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన రోజు. క్యాన్సర్ రోగులకు అత్యున్నత స్థాయి వైద్య సదుపాయం ఇకపై అందుబాటులో ఉంటుంది. క్యాన్సర్ అనేది కేవలం సంపన్నులకే వచ్చే వ్యాధి కాదు. ఇదివరకు అందుబాటులో లేని ఈ హాస్పిటల్స్‌లో ఇకపై చికిత్స తీసుకోవచ్చు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అసోం అనేది భారత్‌లో చిన్న రాష్ట్రమే అయినా ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స సౌలభ్యాలు కలిగివున్న రాష్ట్రమని రతన్ టాటా వ్యాఖ్యానించారు.


ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అసోంలో ఏడు క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు ఏడేళ్లలో ఒక హాస్పిటల్ ప్రారంభమైనా వేడుక చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒకే రోజు ఏడు క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రారంభించాం. మరికొన్ని నెలల వ్యవధిలోనే అసోంలో మరిన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. నెలల వ్యవధిలోనే ఈ హాస్పిటల్స్ అసోం ప్రజల సేవలో తరిస్తాయని దీమా వ్యక్తం చేశారు. ఇక assam chief minister himantha biswa sarma మాట్లాడుతూ.. రాష్ట్రానికి సహకారం అందిస్తున్న రతన్ టాటా, కేంద్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.  అతిపెద్ద క్యాన్సర్ కేర్ హాస్పిటల్ అసోంతోపాటు ఆగ్నేయాసికు కూడా ఎంతో లబ్ది చేకూర్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-04-29T21:28:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising