ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Colombia శాన్‌పెడ్రో ఉత్సవంలో అపశ్రుతి...చెక్క స్టాండ్‌ కూలి నలుగురి మృతి

ABN, First Publish Date - 2022-06-27T13:19:37+05:30

కొలంబియా దేశంలో జరిగిన శాన్‌పెడ్రో ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో 30 మందికి గాయాలు

బొగోటా (కొలంబియా): కొలంబియా దేశంలో జరిగిన శాన్‌పెడ్రో ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బుల్రింగ్‌లోని గ్రాండ్‌స్టాండ్ చిన్న ఎద్దులతో తలపడే కార్యక్రమంలో చెక్క స్టాండ్‌ కూలిపోవడంతో నలుగురు మరణించగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు కొలంబియా దేశ అధికారులు తెలిపారు.ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు,ఒక బాలుడు మరణించారని టోలిమా డిపార్ట్‌మెంట్ గవర్నర్ జోస్ రికార్డో చెప్పారు.ప్రేక్షకులతో నిండిన మూడు-అంతస్తుల చెక్క స్టాండ్‌లు కూలిపోయింది.దీంతో పలువురు ప్రేక్షకులు నేలపైకి పడ్డారు.ఘటనా స్థలంలో ఎవరో తీసిన మరో వీడియోలో ఒక ఎద్దు అరేనాలో తిరుగుతున్నప్పుడు స్టాండ్ నుంచి తప్పించుకుంది. 


ఈ దుర్ఘటనలో మరో 30 మంది గాయపడటంతో వారిని ఏరియా ఆసుపత్రులకు తరలించామని స్థానిక సివిల్ డిఫెన్స్ అధికారి లూయిస్ ఫెర్నాండో వెలెజ్ చెప్పారు.చెక్క స్టాండు కూలినపుడు శిథిలాల్లో ఎంతమంది ఉన్నారో తెలియదని, సహాయ పనులు చేపట్టామని అధికారులు చెప్పారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తామని కొలంబియా అవుట్‌గోయింగ్ ప్రెసిడెంట్ ఇవాన్ డ్యూక్ ట్విట్టర్‌లో తెలిపారు. మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు డ్యూక్ సంఘీభావం తెలిపారు.


Updated Date - 2022-06-27T13:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising