ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటిపైనే కాటికి...

ABN, First Publish Date - 2022-07-22T18:12:37+05:30

అంతిమయాత్రలోనూ కష్టాలు తప్పడం లేదు. మృతి చెందిన వారికి ప్రశాంతంగా అంత్యక్రియలు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. కంప్లి పట్టణంలో వారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- తెప్పమీదే అంతిమయాత్ర

- వంతెన లేక ఇబ్బందులు


 కంప్లి(బెంగళూరు): అంతిమయాత్రలోనూ కష్టాలు తప్పడం లేదు. మృతిచెందిన వారికి ప్రశాంతంగా అంత్యక్రియలు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. కంప్లి పట్టణంలో వారం రోజులుగా తుంగభద్ర నదికి అత్యధిక నీరు రావడంతో నది ఆవలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణానికి చెందిన దమ్మూరు ఫక్కీరమ్మ (65) గురువారం మృతి చెందగా అవతలి ఒడ్డున ఉన్న కంప్లి కోటెలోని శ్మశానంలో అంత్యక్రియలు చేపట్టాలి. కానీ అక్కడున్న సుంకులమ్మదేవి వాగు పూర్తిగా నిండిపోవడంతో బంధువులు, అంత్యక్రియలకు వచ్చిన వారు తెప్పలమీద తీసుకెళ్లి అంత్యక్రియలు చేపట్టారు. పక్కీరమ్మ భర్త దమ్మూరు కాంతప్ప మాట్లాడుతూ ఎంతో మంది బంధువులు వచ్చినా చివరికి అంత్యక్రియల్లో  పాల్గొనే అవకాశం లేకపోయిందని, ఇప్పటికైనా అధికారులు శ్మశానం పక్కన వంతెన ఏర్పాటు చేసి అంత్యక్రియలు చేపట్టే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని వేడుకున్నారు. లేకపోతే మున్ముందు మరిన్ని కష్టాలు త ప్పవని వాపోయారు.


Updated Date - 2022-07-22T18:12:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising