ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీర్ఘకాల కిడ్నీ వ్యాధులకు డపాగ్లిఫ్లోజిన్‌

ABN, First Publish Date - 2022-11-30T02:40:47+05:30

దీర్ఘకాల కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న మధుమేహ రోగులకు కొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుమతించిన ఔషధ నియంత్రణ సంస్థ

న్యూఢిల్లీ, నవంబరు 29: దీర్ఘకాల కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న మధుమేహ రోగులకు కొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా రూపొందించిన డపాగ్లిఫ్లోజిన్‌ అనే ఔషధానికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎ్‌ససీవో) మంగళవారం అనుమతి మంజూరుచేసింది. దీర్ఘకాల కిడ్నీ సమస్యల కారణంగా వయోజనుల్లో తలెత్తే గుండె సంబంధ వ్యాధులు, అలాగే హృద్రోగ మరణాలను తగ్గించడానికి ఈ ఔషధం ఉపయోగపడుతుందని ఆస్ట్రాజెనెకా ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఔషధంతో హృద్రోగాల కారణంగా ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గుతుందని తెలిపింది. ఈ తరహా ఔషధానికి అనుమతి లభించడం ఇదే మొదటిసారని కంపెనీ పేర్కొంది. సీడీఎ్‌ససీవో అనుమతి ప్రకారం... మధుమేహం ఉన్నా, లేకపోయినా, దీర్ఘకాల కిడ్నీ సమస్యలతో బాధపడేవారు డపాగ్లిఫ్లోజిన్‌ను వాడొచ్చని స్పష్టంచేసింది.

Updated Date - 2022-11-30T02:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising