కరెంట్ లేక ఉక్కిరి బిక్కిరి
ABN, First Publish Date - 2022-12-07T04:24:55+05:30
ఛత్తీ్‌సగఢ్‌లో విద్యుత్తు కోతలు నలుగురు నవజాత శిశువుల ప్రాణాలు బలిగొన్నాయి. ఓ ప్రభుత్వాస్పత్రికి నాలుగు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఫలితంగా అక్కడ వెంటిలేషన్ లేకపోవడం, లైఫ్ సపోర్ట్ సిస్టం పనిచేయకపోవడంతోనే శిశువులు ప్రాణాలు విడిచినట్లు చెబుతున్నారు. అంబికాపూ
నలుగురు శిశువుల మృతి
ఛత్తీ్‌సగఢ్‌లోని సర్కారు ఆస్పత్రిలో ఘోరం
అంతా 5 రోజుల లోపు పసికందులే
విద్యుత్తు కోతలతో వెంటిలేషన్ లేక..
లైఫ్ సపోర్ట్ సిస్టం పనిచేయకపోవడంతోనే
ఉన్నతస్థాయి విచారణకు సర్కారు ఆదేశం
రాయ్‌పూర్, డిసెంబరు 6: ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్తు కోతలు నలుగురు నవజాత శిశువుల ప్రాణాలు బలిగొన్నాయి. ఓ ప్రభుత్వాస్పత్రికి నాలుగు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఫలితంగా అక్కడ వెంటిలేషన్ లేకపోవడం, లైఫ్ సపోర్ట్ సిస్టం పనిచేయకపోవడంతోనే శిశువులు ప్రాణాలు విడిచినట్లు చెబుతున్నారు. అంబికాపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని స్పెషల్ న్యూబర్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతిచెందిన శిశువులు అంతా ఐదు రోజుల లోపు వయసున్నవారే! మరికొందరు శిశువుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు కూడా వెంటిలేషన్, లైఫ్ సపోర్ట్ సిస్టం పనిచేసేలా వ్యవస్థ అందుబాటులో ఉందని మెడికల్ కాలేజీ డీన్ మూర్తి పేర్కొన్నారు. శిశువుల మృతి ఘటనపై ఛత్తీ్‌సగఢ్ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
Updated Date - 2022-12-07T04:24:59+05:30 IST