ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhya Pradesh వైద్య విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-03-18T16:18:42+05:30

హోలి సందర్భంగా మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోలీ రోజున నీటి పొదుపు సందేశాలపై ఆగ్రహం

భోపాల్: హోలి సందర్భంగా మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.హోలీ రోజున నీటి పొదుపు సందేశాలపై మంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. దేశంలో కొంతమంది సాంస్కృతిక ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. హిందువుల పండుగల సమయంలో మాత్రమే పర్యావరణం గురించి మాట్లాడి సాంస్కృతిక ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని సారంగ్ ఆరోపించారు.హిందూ మతం పండుగలలో మాత్రమే పర్యావరణం గురించి మాట్లాడటం సాంస్కృతిక ఉగ్రవాదం అని ఆయన అన్నారు.ఇలాంటి సందేశాలను ప్రచారం చేయడం ద్వారా మన యువతను హిందూ పండుగల నుంచి దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని విశ్వాస్ సారంగ్ అన్నారు.



‘‘హోలీ రోజున నీటి పొదుపు అని మాట్లాడే వారు తమ కారు మెరిసిపోవడానికి ఇంత నీటిని వృధా చేస్తారు. ముందు తమను తాము సరిదిద్దుకోవాలి. పండుగల్లోనే ఇలాంటివి ఎందుకు వస్తాయి? పర్యావరణం పేరుతో ఈ వ్యక్తులు మన హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు’’ అని మంత్రి అన్నారు.

Updated Date - 2022-03-18T16:18:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising