ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vadorara నగర వీధిలో Crocodile ప్రత్యక్షం

ABN, First Publish Date - 2022-07-14T16:28:41+05:30

దేశంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదలతో నదిలోని ఓ మొసలి నగర వీధిలో ప్రత్యక్షమైన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వడోదర (గుజరాత్): దేశంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదలతో నదిలోని ఓ మొసలి నగర వీధిలో ప్రత్యక్షమైన ఘటన గుజరాత్‌రాష్ట్రంలోని వడోదరలో గురువారం వెలుగుచూసింది. భారీ వర్షాల మధ్య వరద నీటిలో ఓ మొసలి వడోదర నగర రహదారిపైకి రావడంతో దాన్ని అటవీశాఖ అధికారులు రక్షించారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వడోదరలో వరదలు వెల్లువెత్తడంతో మొసళ్లు సంచరించే సంఘటన వెలుగుచూసింది.వడోదరలోని విశ్వామిత్ర నదిలో వందలాది మొసళ్లు ఉన్నాయి.వడోదరలోని పూజా గార్డెన్ ప్రాంతంలో ఓ మొసలి కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందారు.


 వడోదర నగరంలో వరదనీటి ప్రవాహంతో మొసళ్లు వీధులనే శాశ్వత నివాసంగా మార్చుకుంటున్నాయి.గుజరాత్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు నగరాల్లో వరదలు వెల్లువెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పూర్ణ, అంబికా, కావేరీ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జులై 14 న నవ్‌సారిలో అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.


Updated Date - 2022-07-14T16:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising