ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crocodile: జనావాసాల్లో మొసలి సంచారం

ABN, First Publish Date - 2022-10-28T10:35:27+05:30

స్థానిక నెర్‌కుండ్రం గ్రామంలోకి ప్రవేశించిన మొసలిని(Crocodile) యువకులు బంధించారు. పెరుంగళత్తూర్‌ సమీపంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 27: స్థానిక నెర్‌కుండ్రం గ్రామంలోకి ప్రవేశించిన మొసలిని(Crocodile) యువకులు బంధించారు. పెరుంగళత్తూర్‌ సమీపంలోని నెర్‌కుండ్రం జలాశయంలోని మొసళ్లు తరచూ సమీపంలోని జనావాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో, బుధవారం నెర్‌కుండ్రం మేట్టు వీధిలోకి సుమారు ఏడడుగుల పొడవైన మొసలి ప్రవేశించింది. దానిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొందరు యువకులు తాళ్లలో మొసలిని బంధించి అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. గిండి అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకొని మొసలిని తీసుకెళ్లారు. జలాశయంలోని మొసళ్లు గ్రామాల్లో ప్రవేశించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2022-10-28T10:35:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising