ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్ ఫంగస్ మహమ్మారి వెనుక ఆవు పేడ!: పరిశోధన

ABN, First Publish Date - 2022-04-08T17:42:58+05:30

బ్లాక్ ఫంగస్ మ్యుకోరేల్స్ అనే శీలింధ్రాల ద్వారా సంక్రమిస్తుందని, అయితే ఇతర దేశాల్లోని పరిస్థితులను ఇండియాలోని పరిస్థితులను వాళ్లు పోల్చి చూస్తే.. భారతీయ సంప్రదాయంలో భాగమైన ఆవుపేడ నుంచి మ్యుకోరేల్స్ శీలింద్రాలు అధిక సంఖ్యలో విడుదల అవుతున్నాయని, ముఖ్యంగా ఆవు పేడను కాల్చడం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవిడ్ నుంచి చికిత్స కోలుకున్న తర్వాత చాలా మంది బ్లాక్ ఫంగస్‌(మ్యూకోర్మైకోసిస్) సోకి వేలాది మంది మరణించారు. అలాగే అనేక మంది ఆ వ్యాధి బారిన పడ్డారు. 2021లో దేశాన్ని కుదిపివేసిన ఈ బ్లాక్‌ ఫంగస్‌కు కారణం ఆవు పేడ అయి ఉంటుందని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. ది యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ వారు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో ఒక్క ఇండియాలోనే 71 శాతం మంది ఉన్నారని, ఇందులో మరణాల సంఖ్య 54 శాతమని పేర్కొన్నారు. గతేడాది నవంబర్ నాటికి ఇండియాలో 51,775 మంది బ్లాక్ ఫంగస్‌కు లోనయ్యారని పేర్కొంది.


బ్లాక్ ఫంగస్ మ్యుకోరేల్స్ అనే శీలింధ్రాల ద్వారా సంక్రమిస్తుందని, అయితే ఇతర దేశాల్లోని పరిస్థితులను ఇండియాలోని పరిస్థితులను వాళ్లు పోల్చి చూస్తే.. భారతీయ సంప్రదాయంలో భాగమైన ఆవుపేడ నుంచి మ్యుకోరేల్స్ శీలింద్రాలు అధిక సంఖ్యలో విడుదల అవుతున్నాయని, ముఖ్యంగా ఆవు పేడను కాల్చడం వల్ల వచ్చే పొగ నుంచి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోందని జెస్సీ స్కారియా అనే రీసెర్చర్ తెలిపారు. కొవిడ్-19 సమయంలో భారతదేశంలో బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందడానికి ఇదే కీలక పాత్ర పోషించి ఉండవచ్చని వారు అంటున్నారు.


ఇరాన్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించామని అంటున్నారు. అక్కడ గాడిద పేడను కాల్చడం అలవాటుగా ఉందని, అక్కడ కూడా మ్యూకోర్మైకోసిస్ కేసులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. దానికి కారణం గాడిద పేడ కాల్చడం నుంచి వచ్చిన పొగే కారణం అయి ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.

Updated Date - 2022-04-08T17:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising