ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid థర్డ్‌వేవ్‌ కట్టడికి కఠినచర్యలు

ABN, First Publish Date - 2022-01-17T17:55:44+05:30

కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ వ్యాపించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని బళ్లారి జిల్లా కలెక్టర్‌ పవన్‌కుమార్‌ మాలపాటి పేర్కొన్నారు. ఈ మేరకు బళ్లారి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- హాస్టల్‌ విద్యార్థులను బలవంతంగా ఇంటికి పంపొద్దు 

- బళ్లారి జిల్లా కలెక్టర్‌ పవన్‌కుమార్‌ మాలపాటి


బళ్లారి(కర్ణాటక): కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ వ్యాపించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని బళ్లారి జిల్లా కలెక్టర్‌ పవన్‌కుమార్‌ మాలపాటి పేర్కొన్నారు. ఈ మేరకు బళ్లారి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, సినిమా థియేటర్లు, విశ్వవిద్యాలయాలను ఈనెల 23వరకు పూర్తిగా మూసివేయాలని శనివారం ఆదేశాలు జారీ చేశారు. జిందాల్‌ చుట్టు పక్కల తోరణగల్లు, బీటీపీఎస్‌, కుడతిని, వడ్డు, సుల్తాన్‌పురం, తారానగర్‌, కురేకుప్ప, జిందాల్‌ టౌన్‌ షిప్‌లో ఉన్న 1 నుండి 8వ తరగతి వరకు పాఠశాలను మూసివేయాలన్నారు. నియమాలను ఉల్లంఘించిన పాఠశాలలపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. జిల్లాలో కర్ఫ్యూను జనవరి 31 వరకు కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని మతాలకు చెందిన ధార్మిక కేంద్రాలను మూసివేయాలని తెలిపారు. 


నిరాశ్రయులైన విద్యార్థులకు హాస్టల్‌ అవసరం

సాంఘిక సంక్షేమశాఖ, షెడ్యూల్‌ తెగల సంక్షేమశాఖ, మైనారిటీ సంక్షేమశాఖకు చెందిన రెసిడెన్సియల్‌ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులను ఇంటికి వెళ్లేందుకు ఇష్టపడని పక్షంలో వారికి వసతి కల్పించాలని కలెక్టర్‌ పవన్‌కుమార్‌ మాలపాటి ఆదివారం అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఇంటికి వెళ్లవచ్చునని, అయితే వారిని బలవంతంగా పంపవద్దని అధికారులకు ఆదేశించారు. సంక్షేమ శాఖల అధికారులు తమ పరిధిలోని మూడు హాస్టళ్లను కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేయడానికి ఖాళీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలితే ఖాళీగా ఉన్న ఈ హాస్టళ్లకు మార్చాలని ఆదేశించారు.

Updated Date - 2022-01-17T17:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising