ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్మగోవా Cordelia cruise shipలో కలకలం

ABN, First Publish Date - 2022-01-04T17:09:36+05:30

కార్డెలియా విహారనౌకలో కలకలం ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా రోగులను ఐసోలేషన్ చేయలేదు... ప్రయాణికుల నిరసన

ముంబై : కార్డెలియా విహారనౌకలో కలకలం ఏర్పడింది. విహార నౌకలో 66మంది కరోనా రోగులున్నా వారిని ఐసోలేషన్‌లో ఉంచలేదని తోటి ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. కరోనా రోగులను మర్మగోవాలోని ఐసోలేషన్ వార్డుకు తరలించకుండా గోవా ఆరోగ్యశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో 66మంది కరోనా రోగులున్న కార్డెలియా క్రూయిజ్ షిప్ మర్మాగోవా సముద్ర తీరం నుంచి ముంబైకు బయలు దేరింది. దీంతోపాటు క్రూయిజ్ షిప్‌లో కరోనా నెగిటివ్ వచ్చిన వారిని కూడ ఓడ దిగేందుకు పోర్టు ట్రస్టు అధికారులు అనుమతించలేదు.క్రూయిజ్ షిప్ లో 1200 మంది ప్రయాణికులున్నారు. కరోనా వచ్చిన 66 మంది రోగులను ఐసోలేషన్ లో ఉంచక పోవడంతో తమకు కూడా కరోనా సోకే ప్రమాదముందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.


 కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు వైద్యసహాయం చేయక పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. క్రూయిజ్ షిప్ లో ఉన్న తన పిల్లలు, సోదరుడి ఆరోగ్యం గురించి జస్వీర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.కరోనా నెగిటివ్ వచ్చిన వారిని షిప్ నుంచి బయటకు వెళ్లడానికి ఎందుకు అనుమతించలేదని ప్రయాణికులు ప్రశ్నించారు.క్రూయిజ్ షిప్ లాబీ ఏరియాలో కరోనా రోగులు తిరుగుతున్నారని, దీనివల్ల తమకు కూడా కరోనా సోకే ప్రమాదముందని ప్రయాణికులు ఆవేదనగా చెప్పారు.గోవా ప్రభుత్వం, ఆరోగ్యశాఖ అధికారులు చాలా నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, క్రూయిజ్ షిప్ లో ఉన్న తమను ఆదుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.


‘‘క్రూయిజ్ షిప్‌లో ఉన్నవారు భారతదేశానికి చెందినవారు. వారు గ్రహాంతరవాసులు కాదు, వేరే దేశానికి చెందినవారు కాదు. క్రూయిజ్ షిప్‌లోని వారందరూ భారతీయులే, దయచేసి తమకు సహాయం చేయండి’’ అని జస్వీర్ సింగ్ అనే ప్రయాణీకుడు కోరారు.


Updated Date - 2022-01-04T17:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising