ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో జాగ్రత్త: కేంద్రం

ABN, First Publish Date - 2022-08-13T08:54:07+05:30

దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వాతంత్య్ర వేడుకల్లో పెద్ద ఎత్తున గూమికూడొద్దని సూచన


న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కొవిడ్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర హోం శాఖ సూచించింది. అలాగే ప్రతి జిల్లాలో ప్రముఖ ప్రాంతంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ప్రజల భాగస్వామ్యంతో పక్షం రోజులు- నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొంది. కాగా దేశంలో కొత్తగా 16,561 కరోనా కేసులు నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 4,42,23,557కు పెరిగిందని, ప్రస్తుతం 1,23,535 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది.  

Updated Date - 2022-08-13T08:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising