ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కొనసాగుతున్న Covid ఉధృతి.. కొత్తగా 14,506 కేసులు

ABN, First Publish Date - 2022-06-29T15:39:07+05:30

దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. యాక్టీవ్ కేసులు దాదాపు లక్షకు చేరువలో ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కొవిడ్(Covid) కేసులు భారీగా పెరుగుతున్నాయి. యాక్టీవ్ కేసులు దాదాపు లక్షకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,506 కొత్త కేసులు నమోదు అవగా... 30 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.35 శాతానికి చేరింది. దేశంలో యాక్టీవ్ కేసులు 0.23 శాతంగా ఉంది. అలాగే దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం  4,34,33,345 కొవిడ్ కేసులు నమోదు అవగా.. మొత్తం 5,25,077మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.56 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి  11,574 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,28,08,666గా ఉంది.


మరోవైపు దేశంలో గత 530 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు  197.46 కోట్ల డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 13,44,788 డోసుల టీకాలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 197,46,57,138 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య  శాఖ వెల్లడించింది. అటు దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 86.19 కోట్లు దాటాయి. గడిచిన 24 గంటల్లో 4,33,659 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 86,19,23,059 టెస్టులను నిర్వహించారు. దేశంలో దాదాపు 3387 లాబ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1437 ప్రభుత్వ లాబ్స్,1950 ప్రైవేట్ లాబ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. 

Updated Date - 2022-06-29T15:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising