ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో 86కు పడిపోయిన Covid కేసులు

ABN, First Publish Date - 2022-03-15T13:26:54+05:30

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 86కు పడిపోయింది. ప్రజల్లో రేగిన చైతన్యం, అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు తదితరాల కారణంగా రాష్ట్రంలో గణనీయంగా కరోనా విస్త్రతి తగ్గిపోయింది. ఆదివారమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 86కు పడిపోయింది. ప్రజల్లో రేగిన చైతన్యం, అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు తదితరాల కారణంగా రాష్ట్రంలో గణనీయంగా కరోనా విస్త్రతి తగ్గిపోయింది. ఆదివారమే వందకంటే తక్కువకు పడిపోయిన కేసుల సంఖ్య సోమవారానికి 86కు చేరుకోవడం పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఇదే కొనసాగితే త్వరలోనే కరోనా రహిత రాష్ట్రంగా తమిళనాడు రికార్డులకెక్కడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సోమవారం 86 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 34,51,996కి పెరిగింది. చెన్నైలో 33 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో నగరంలో కరోనా బాధితుల సంఖ్య 7,50,760కి పెరిగింది. రాష్ట్రంలో సోమవారం కరోనా కారణంగా ఒక్కరు మృతిచెందగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 38,024గా ఉంది. తాజాగా 204 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 34,12,918కి పెరిగింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,054 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 40,825 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Updated Date - 2022-03-15T13:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising