ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిగ్నేష్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

ABN, First Publish Date - 2022-04-29T00:19:01+05:30

ప్రధాని మోడీపై వివాదాస్పద ట్వీట్ల కేసులో సోమవారం బెయిల్ పొందిన కొద్దిసేపటికే పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించాడంటూ జిగ్నేష్‌ను అస్సాం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం జిగ్నేష్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బర్పెట కోర్టు మొదట తిరస్కరించింది. అతడికి ఐదురోజుల పోలీసు కస్టడీకి కోర్టు ఆదేశించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువహాటి: గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని పెట్టుకున్న బెయిల్‌పై తీర్పును అస్సాంలోని బర్పెట జిల్లా కోర్టు రిజర్వులో పెట్టింది. పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో మేవానీని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, కోర్టు తన తీర్పును శుక్రవారం వెల్లడిస్తుందని మేవానీ తరపు న్యాయవాది అన్షుమన్ బోరా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘బర్పెట సెసన్ష్ కోర్టులో మేము బెయిల్ పిటిషన్ వేశాం. గురువారం సాయంత్రం నాటికే విచారణ పూర్తైంది. అయితే అవతలి వైపునుంచి అభ్యంతరాల కోసం తీర్పును రిజర్వులో పెట్టారు’’ అని తెలిపారు.


ప్రధాని మోడీపై వివాదాస్పద ట్వీట్ల కేసులో సోమవారం బెయిల్ పొందిన కొద్దిసేపటికే పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించాడంటూ జిగ్నేష్‌ను అస్సాం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం జిగ్నేష్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బర్పెట కోర్టు మొదట తిరస్కరించింది. అతడికి ఐదురోజుల పోలీసు కస్టడీకి కోర్టు ఆదేశించింది. కాగా, ఈ విషయమై కొద్ది రోజుల క్రితం జిగ్నేష్ స్పందిస్తూ తన అరెస్ట్‌ను ప్రధానమంత్రి కార్యాలయం చేస్తున్న కక్షపూరిత రాజకీయంగా అభివర్ణించారు. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల కుట్రగా విమర్శించారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు కళంకం తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. ఇదంతా పద్దతి ప్రకారం జరిగిందని మండిపడ్డ ఆయన.. రోహిత్ వేముల నుంచి చంద్రశేఖర్ అజాద్ వరకు జరిగిందిదే అని పేర్కొన్నారు. ఇప్పుడు తనను లక్ష్యంగా చేసుకున్నారని జిగ్నేష్ మేవానీ మండిపడ్డారు.

Updated Date - 2022-04-29T00:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising