ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jacqueline Fernandez: రక్కమ్మకు కాస్తంత రిలాక్స్.. కానీ తాత్కాలికమే..!

ABN, First Publish Date - 2022-09-26T17:30:05+05:30

మనీ లాండరింగ్ కేసులో (Rs200 Crore Extortion Case) బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు (Jacqueline Fernandez) కాస్తంత ఊరట..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో (Rs200 Crore Extortion Case) బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు (Jacqueline Fernandez) కాస్తంత ఊరట లభించింది. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీలోని పాటియాల హౌస్ కోర్ట్ (Patiala House Court) జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు 50 వేల రూపాయల బాండ్ పేపర్‌తో కూడిన తాత్కాలిక బెయిల్‌ను (Interim Bail) మంజూరు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా, ప్రధాని మంత్రి కార్యాలయంలో అధికారిగా నమ్మించి రూ.200 కోట్లు దండుకున్న సుఖేష్ చంద్రశేఖర్‌ (Sukesh Chandrashekhar) అనే కేటుగాడితో సావాసమే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొంప ముంచింది. అతనితో ఉన్న సన్నిహిత సంబంధాల మూలంగా జాక్వెలిన్‌ కూడా ఈ Extortion Racket కేసులో ఇరుక్కుంది. ఈడీ ఆమెను ఇప్పటికే పలుమార్లు విచారించింది. సుఖేష్ చంద్రశేఖర్‌ అనే వ్యక్తితో జాక్వెలిన్ పరిచయం ఎంతవరకూ వెళ్లిందంటే.. ఒకానొక సమయంలో అతనిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా చేసినట్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ విచారణలో వెల్లడించినట్లు వార్తలొచ్చాయి.



ఇదిలా ఉండగా.. ఈ కేసు నుంచి బయటపడటానికి జాక్వెలిన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఆమె తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ కేసు విచారణలో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోర్టుకు హాజరయింది. పాటియాల హౌస్ కోర్టు ఈ కేసులో జాక్వెలిన్‌కు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 22కు వాయిదా వేసింది. ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు జాక్వెలిన్‌కు రెండు సార్లు సమన్లు జారీ చేశారు. మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ నుంచి కోట్ల రూపాయల విలువైన గిఫ్ట్‌లు పొందినట్లు జాక్వెలిన్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. గత వారం ఇదే కేసులో ఫెర్నాండెజ్ స్టైలిస్ట్ లీపాక్షి ఎల్లవాడిని కూడా ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విచారణ విభాగం (Economic Offences Wing) ఎనిమిది గంటల పాటు విచారించింది.



జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సుఖేష్ చంద్రశేఖర్ మధ్య ఉన్న సంబంధం గురించి జాక్వెలిన్ తనతో చెప్పిందని ఈ స్టైలిస్ట్ విచారణలో తెలిపింది. సుఖేష్ చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిన వెంటనే అతనితో ఉన్న అన్ని సంబంధాలకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దూరంగా ఉంది. ప్రస్తుతం సుఖేష్ చంద్రశేఖర్‌ జైలులో ఉన్నాడు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులే టార్గెట్‌గా సుఖేష్ మోసాలకు తెరలేపాడు. former Fortis Healthcare promoter శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ కూడా మోసపోయిన బాధితుల్లో ఉన్నారు. సుఖేష్ చంద్రశేఖర్‌తో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో పాటు నోరా ఫతేహీకి కూడా సంబంధాలున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ బ్యూటీలిద్దరికీ ఖరీదైన కార్లను, కోట్లు విలువ చేసే బహుమతులను సుఖేష్ సమర్పించుకున్నట్లు ఈడీ చెప్పింది.

Updated Date - 2022-09-26T17:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising