ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేషన్‌ ఎన్నికల వాయిదా కోసం హైకోర్టులో పిటిషన్‌

ABN, First Publish Date - 2022-01-20T16:15:23+05:30

రాష్ట్రంలో కరోనా మూడో అల వేగంగా ప్రబలుతుండడాన్ని పరిగణలోకి తీసుకొని పురపాలక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ మాజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - రేపు విచారణ


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా మూడో అల వేగంగా ప్రబలుతుండడాన్ని పరిగణలోకి తీసుకొని పురపాలక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ మాజీ వైద్యుడు నక్కీరన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ప్రభాకరన్‌ దాఖలుచేసిన పిటిషన్‌లో, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా మరింత ప్రబలే అవకాశముందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి బుధవారం అఖిలపక్షాలతో సమావేశం కానున్న ఎన్నికల కమిషన్‌ ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించే అవకాశముందని, కావున అత్యవసర పిటిషన్‌గా పరిగణించి విచారణ చేపట్టాలని కోరారు. ఈ విషయం పరిగణలోకి తీసుకున్న ఇన్‌ఛార్జి చీఫ్‌ జస్టిస్‌ ఆదికేశవులతో కూడిన ధర్మాసనం, శుక్రవారం పిటిషన్‌ విచారించనున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. కాగా, రాష్ట్రంలో మిగిలిన పురపాలక సంఘాల ఎన్నికల నోటిఫి కేషన్‌ ఈ నెల 27వ తేదిలోపు విడుదల చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించగా, తాజాగా, ఎన్నికలు వాయిదావేయాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Updated Date - 2022-01-20T16:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising