ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PayCM t-shirt: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తపై పోలీసుల పిడిగుద్దులు

ABN, First Publish Date - 2022-10-02T02:42:47+05:30

భారత్ జోడో (Bharat Jodo) యాత్రలో పాల్గొన్న ఓ కాంగ్రెస్ కార్యకర్త(Congress worker)పై పోలీసులు పిడిగుద్దులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: భారత్ జోడో (Bharat Jodo) యాత్రలో పాల్గొన్న ఓ కాంగ్రెస్ కార్యకర్త(Congress worker)పై పోలీసులు పిడిగుద్దులు కురిపించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. ‘పేసీఎం’ (PayCM) అని రాసి ఉన్న టీషర్టును ధరించడమే అతడు చేసిన నేరమైంది. ఆ టీషర్టు(PayCM T-Shirt)ను పోలీసులు అతడితో బలవంతంగా విప్పించారు. అంతేకాదు, అతడు విప్పుతున్నప్పటికీ వెనక నుంచి ఓ పోలీసులు అతడిపై పిడిగుద్దులు కురిపిస్తూనే ఉన్నాడు. చుట్టూ బోల్డంత మంది జనం ఉన్నా, ఆ ఘటనను వీడియో తీస్తున్నా వెనక్కి తగ్గలేదు సరికాదా.. మరింతగా ఆ పోలీసు రెచ్చిపోయాడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో (Bharat Jodo) యాత్ర శనివారం బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో అడుగుపెట్టింది. 


కర్ణాటకలోని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై (Basavaraja Bommai) ప్రజాపనులకు సైతం 40శాతం కమిషన్ తీసుకుంటారంటూ ఇటీవల ప్రతిపక్షాలు ఆరోపించాయి. కొన్ని చోట్ల ‘పేసీఎం’(PayCM) అన్న పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్త(Congress worker) అక్షయ్ కుమార్ ‘పేసీఎం’(PayCM) అని రాసి ఉన్న టీషర్టును ధరించాడు. అంతకుముందు కుమార్ క్యూఆర్ కోడ్‌తో కూడిన పేసీఎం పోస్టర్‌తో తెల్లటి జెండాను పట్టుకుని కనిపించాడు. కుమార్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 


పేటీఎం టీష్టర్లు(PayCM T-Shirt) ధరించిన తమ కార్యకర్తపై జరిగిన దౌర్జన్యం ఖండించదగినదని పేర్కొన్న కాంగ్రెస్.. అతడి టీషర్టు(PayCM T-Shirt) తీయించి దాడిచేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. వారు పోలీసులా? లేదంటే గూండాలా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడి చేసిన పోలీసును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తమ అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే పోలీసులను ప్రయోగిస్తోందని ఆరోపించారు. కాగా, పోలీసుల దాడిలో గాయపడిన కార్యకర్తపైనే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.



Updated Date - 2022-10-02T02:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising