వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు!
ABN, First Publish Date - 2022-10-17T08:46:38+05:30
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
జోడో యాత్రలో రాహుల్‌ధీమా
బెంగళూరు/బళ్లారి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో సాగుతున్న భారత్ జోడో యాత్ర 39వ రోజు ఆదివారం బళ్లారి నుంచి మెకా వరకు సాగింది. ఈ సందర్భంగా సంగనకల్లు వద్ద జీన్స్ అండ్ టెక్స్‌టెల్స్ పరిశ్రమల యజమానులు, కార్మికులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. బళ్లారిలో సుమారు 200కు పైగా జీన్స్ పరిశ్రమలు ఉన్నాయని కొవిడ్ కారణంగా పరిశ్రమలు చాలా మూత పడ్డాయని వివరించారు. వారి సమస్యలు విన్న అనంతరం రాహుల్‌గాంధీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, మీ కష్టాలు తీరుస్తామని భరోసా ఇచ్చారు. కాగా, భారత్ జోడో యాత్ర ఖర్చులు భరించలేమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో యాత్ర ఖర్చులు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ భరించాలని పార్టీ అధిష్టానం సూచించినట్టు తెలిసింది.
Updated Date - 2022-10-17T08:46:38+05:30 IST