ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress సోషల్‌ మీడియా చైర్మన్‌గా ప్రియాంకఖర్గే

ABN, First Publish Date - 2022-07-09T17:10:23+05:30

రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా పార్టీ నేతలకు కీలక పదవులను ఏఐసీసీ కమిటీ అప్పగించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ మేరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా పార్టీ నేతలకు కీలక పదవులను ఏఐసీసీ కమిటీ అప్పగించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర సోషల్‌ మీడియా చైర్మన్‌ బాధ్యతలను ఎమ్మెల్యే ప్రియాంకఖర్గేకు అప్పగించింది. కో-చైర్మన్‌గా మన్సూర్‌ అలీఖాన్‌ను, అధికార ప్రతినిధిగా ఎమ్మెల్సీ నాగరాజ్‌ యాదవ్‌, కమ్యూనికేషన్‌ విభాగం వైస్‌చైర్మన్లుగా ఎమ్మెల్సీ దినేశ్‌గూళిగౌడ, మాజీ ఎమ్మెల్సీ రమేశ్‌బాబును నియమించారు. కమ్యూనికేషన్‌ విభాగం జనరల్‌ సెక్రటరీలుగా లావణ్య బల్లాల్‌, కవితారెడ్డి, డాక్టర్‌ నాగల క్ష్మి, ఐశ్వర్య మహదేవ్‌ను నియమించారు. కేపీసీసీ వార్‌రూం చైర్మన్‌గా శశికాంత్‌ సెంధిల్‌, ఓవరాల్‌ ఇన్‌చార్జ్‌గా సునిల్‌ కానుగోళును నియమించారు. కేపీసీసీ ఉపాధ్యక్షుడిగా సూరజ్‌హెగ్డే, ప్రధాన కార్యదర్శిగా మెక్రోజ్‌ఖాన్‌ను నియమించారు. శాసనసభ ఎన్నికల దృష్ట్యా వీరిని నియమించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-09T17:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising