ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

one man one post:​ గెహ్లాట్‌కు రాహుల్ షాక్! డబుల్ రోల్‌పై దారిలోకొచ్చిన ముఖ్యమంత్రి

ABN, First Publish Date - 2022-09-22T22:08:47+05:30

తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు షాకిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు షాకిచ్చారు. ఒకరికి ఒకే పదవి అనే సూత్రం పాటించాల్సిందేనని రాహుల్ గెహ్లాట్‌కు స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర 15వ రోజుకు చేరుకున్న సందర్భంగా అశోక్ గెహ్లాట్ రాహుల్‌ను కేరళలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకే పదవి అనే సూత్రంపై రాహుల్ కుండబద్దలు కొట్టారు. దీంతో గెహ్లాట్ దారిలోకి వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడంటే దేశవ్యాప్తంగా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి జోడు పదవులు కుదరవని గెహ్లాట్ చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అంటే ఓ సిద్ధాంతమని, కాంగ్రెస్ పార్టీ ఓ కుటుంబం లాంటి దని కూడా రాహుల్ చెప్పారు. 


వాస్తవానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచాక కూడా రాజస్థాన్ సీఎం పోస్టులో కొనసాగాలని అశోక్ గెహ్లాట్ భావించారు. ఏకకాలంలో మూడు పదవుల్లో కూడా కొనసాగగలిగే శక్తి సామర్ధ్యాలున్నాయని ఆయన మీడియాతో వ్యాఖ్యానించడం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశంలో కూడా ఆయన ఈ ప్రతిపాదన తెచ్చారు. అయితే ఈ ప్రతిపాదనకు పార్టీలోని మిగతా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకరికి ఒకే పదవి అనే సూత్రం పాటించాల్సిందేనని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. 


అటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ఈ విషయంపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఒకరు ఒకే పదవిలో మాత్రమే కొనసాగాలని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ ఎప్పుడు వేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా నామినేషన్లకు చివరి తేదీ అయిన సెప్టెంబర్ 30వరకూ వేచి చూడాలన్నారు. 


కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలనే ఆలోచన చేయడం వెనుక సచిన్ పైలట్‌కు ఆ పదవి దక్కవద్దనేది గెహ్లాట్ ఆలోచన. స్పీకర్ సీపీ జోషిని సీఎం చేయాలని కూడా గెహ్లాట్ భావిస్తున్నారు. సచిన్ పైలట్ సమర్థుడు కాదని, నికమ్మ( అసమర్థుడు) అని  గతంలోనే గెహ్లాట్ బహిరంగంగా విమర్శించారు. అందుకే స్పీకర్ సీపీ జోషిని రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. తద్వారా సచిన్ పైలట్‌కు కూడా చెక్ పెట్టాలని గెహ్లాట్ యోచన. గెహ్లాట్ ఎత్తుగడను ముందుగానే గ్రహించిన సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకరికి ఒకే పదవి అనే సూత్రంపై గెహ్లాట్‌‌కు రాహుల్ తేల్చి చెప్పడంతో సచిన్ పైలట్‌కు లైన్ క్లీయర్ అయినట్లు సమాచారం. 


సెప్టెంబర్ 30 వరకూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణకు గడువు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 19న కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడెవరో తేలిపోతుంది.  

Updated Date - 2022-09-22T22:08:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising