ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tamilnadu: శశిథరూర్‌‌కు చుక్కెదురు.. ఖర్గే వైపే మొగ్గు..

ABN, First Publish Date - 2022-10-07T20:36:29+05:30

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వైపే పార్టీ తమిళనాడు విభాగం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వైపే పార్టీ తమిళనాడు విభాగం మెజారిటీ కార్యకర్తల మొగ్గు కనిపిస్తోంది. శశిథరూర్ ఏర్పాటు చేసిన సమావేశానికి వేళ్లమీద లెక్కపెట్టుకునే సంఖ్యలోనే కార్యకర్తలు హాజరుకావడం ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. తమిళనాడు నుంచి కాంగ్రెస్ ఎలక్టోరల్ కాలేజీలో 710 ఓటర్లు ఉన్నారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుతూ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో శశిథరూర్ గురువారంనాడు సమావేశం ఏర్పాటు చేశారు.


ఖర్గే ఇంకా తమిళనాడులో తన ప్రచారం ప్రారంభించనప్పటికీ థరూక్ సమావేశానికి వచ్చిన స్పందనను బట్టే గాలి ఎటువైపు వీచనుందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఖర్గేకు అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన ఆరు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుటుంబం బహిరంగంగా ఎవరికి మద్దతు ప్రకటించనప్పటికీ, ఖర్గేకు ఆ కుటుంబ మద్దతు ఉంటుందని చెప్పవచ్చు. సత్యమూర్తి భవన్‌లో శశిథరూర్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని దాదాపు పార్టీ సీనియర్ నేతలంతా దూరంగా ఉండటం చూస్తే ఖర్గే వైపే మొగ్గు ఉందనేది అవగతమవుతుంది.


దీనిపై పార్టీ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ, సాధారణ కార్యకర్తలు థరూర్‌కు సపోర్ట్ చేయరని, ఎందుకంటే ఆయన పార్టీ కార్యకర్తలు అంతగా అందుబాటులో ఉంటే అవకాశాలు లేవని అన్నారు. శశిథరూర్ నియోజకవర్గం నుంచి తాము సేకరించిన సమాచారం ప్రకారం, ఆయన ఎప్పుడూ సాధారణ కార్యకర్తలను కలవరని, ఉన్నతవర్గాల మనిషిగానే ఆయనను పరిగణిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అట్టడుగు వర్గాల నేతలే కావాలని, కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ ఎదిగిన వ్యక్తులే సంస్థను నడపగలుతారనే అభిప్రాయం అందిరిలోనూ ఉందని అన్నారు. మరో సీనియర్ నేత, పార్టీ ఆఫీస్ బేరర్ మాట్లాడుతూ, థరూర్ బయట ప్రపంచాన్ని చక్కగా విశ్లేషించగలరని, చక్కటి ఆంగ్లం మాట్లాడతారని, గ్లోబల్ కాంటాక్ట్‌ల విషయంలో ఆయన మెరుగైన పనితీరు కనబరచగలరని అన్నారు. అయితే అది పార్టీకి ఎంతవరకూ పనికొస్తుందేదే ప్రశ్న అని అన్నారు. అట్టడుగు స్థాయి కార్తకర్తలతో మమేకమయ్యే నేతకే సహజంగా క్యాడర్ మద్దతు ఉంటుందన్నారు. సామాన్య క్యాడర్‌కు దౌత్యభాష తెలియదని, తమ మనోభావాలు తెలుసుకునే వ్యక్తి అయితేనే బాగుంటుందని అనుకుంటారని, ఆ రకంగా ఖర్గేవైపే మొగ్గు కనిపిస్తోందని చెప్పారు.

Updated Date - 2022-10-07T20:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising