ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra: రాహుల్ టీ షర్ట్ ధరపై రగడ

ABN, First Publish Date - 2022-09-09T21:15:22+05:30

తిరునల్వేలి: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధరించిన టీ షర్ట్ ధరపై రగడ మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరునల్వేలి: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధరించిన టీ షర్ట్ ధరపై రగడ మొదలైంది. బర్‌బెర్రీ (Burberry)బ్రాండ్‌కు చెందిన 41 వేల 257  రూపాయల టీ షర్ట్ ధరించి రాహుల్ పాదయాత్ర చేస్తున్నాడని, అదే టీ షర్ట్‌తో ఆయన తిరునల్వేలిలో విలేకరుల సమావేశం నిర్వహించారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఖరీదైన దుస్తులు ధరించి రాహుల్ ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ఇంత ఖరీదైన దుస్తులు ధరించే నాయకుడికి నిరుపేదల సమస్యలు ఏం తెలుస్తాయని బీజేపీ ప్రశ్నించింది. భారత్ జోడో యాత్ర కోసం రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు ఉపయోగిస్తున్న కంటైనర్లు కూడా విలాసవంతంగా ఉన్నాయని బీజేపీ విమర్శించింది. 


మరోవైపు బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. భారత్ జోడో యాత్రకు వస్తోన్న అనూహ్య స్పందనను చూసి ఓర్వలేక బీజేపీ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారని కాంగ్రెస్ తెలిపింది. 


అంతకు ముందు తిరునల్వేలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాహుల్ ప్రజలతో మమేకమవడం కోసమే భారత్ జోడో యాత్ర జరుగుతోందని చెప్పారు. బీజేపీ-ఆరెస్సెస్ వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం దేశవ్యాప్తంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని వ్యవస్థలు ఇప్పుడు బీజేపీ నియంత్రణలో ఉన్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యవస్థలను వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. పోరాటం రాజకీయ పార్టీల మధ్య కాదని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల గురించి ప్రస్తావించినపుడు గాంధీ మాట్లాడుతూ, తాను ఓ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఎన్నికలు జరిగితే తన నిర్ణయం స్పష్టమవుతుందన్నారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టేది, లేనిది స్పష్టంగా వెల్లడవుతుందన్నారు. అప్పటి వరకు వేచి చూడాలని కోరారు. ఈ విషయంలో తాను చాలా స్పష్టంగా ఉన్నానని చెప్పారు. కన్యా కుమారి నుంచి కశ్మీరు వరకు జరుగుతున్న భారత్ జోడో యాత్రకు తాను నాయకత్వం వహించడం లేదన్నారు. తాను కేవలం ఈ యాత్రలో పాలుపంచుకుంటున్నానని చెప్పారు. ‘‘ఈ యాత్ర వల్ల నా గురించి, ఈ అందమైన దేశం గురించి కొంత అవగాహన చేసుకుంటాను, ఈ రెండు, మూడు నెలల్లో నేను మరింత అవగాహన పెంచుకుంటాను’’ అని తెలిపారు. 


భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గుండా సాగుతుంది. 



Updated Date - 2022-09-09T21:15:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising