ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్ సమావేశాలు : కాంగ్రెస్ నేతల సమావేశం శుక్రవారం

ABN, First Publish Date - 2022-01-27T23:26:35+05:30

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలను నిర్ణయించేందుకు కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం సమావేశం కాబోతున్నారు. పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ నేతలతో జరిగే ఈ సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వం వహిస్తారు. వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, కే సురేశ్, జైరామ్ రమేశ్, మాణిక్కం ఠాగూర్, రవ్‌నీత్ సింగ్ బిట్టు పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 


పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమవుతాయి. రాజ్యసభ, లోక్‌సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తొలి దశ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. రెండో దశ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. 


కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు షిఫ్టులవారీగా జరుగుతాయి. 


Updated Date - 2022-01-27T23:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising