ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ సలహా

ABN, First Publish Date - 2022-04-10T16:42:22+05:30

బ్రిటిషర్లు సైతం పంజాబ్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసేవిధంగా ప్రణాళికలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్ : బ్రిటిషర్లు సైతం పంజాబ్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసేవిధంగా ప్రణాళికలు రచిస్తున్నానని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా స్పందిస్తూ, ‘‘ముందు మన ఇంటిని చక్కదిద్దండి. న్యాయమైన పరిపాలనను అందించండి’’ అని సలహా ఇచ్చారు. 


ముఖ్యమంత్రి మాన్ శనివారం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈసారి కూడా మూడున్నర లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని, ఒక్కొక్కరితోపాటు రూ.15 లక్షలు కూడా విదేశాలకు వెళ్తోందని అన్నారు. దీనిని మనం సరిదిద్దగలమని నమ్మాలని, ఆ భరోసాను తాను ఇస్తున్నానని చెప్పారు. ‘‘మీరు ఇక్కడే ఉండి, దేశానికి సేవ చేయాలి. మనం మేధో వలసను ఆపాలి. మాకు ఓ అవకాశం ఇవ్వండి. ఉద్యోగాల కోసం బ్రిటిషర్లు ఇక్కడికి వచ్చే విధంగా మేం ప్రణాళికలు రచిస్తున్నాం’’ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో హల్‌చల్ చేస్తోంది. 


ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా స్పందిస్తూ, ‘‘ఉద్యోగాల కోసం విదేశీయులు పంజాబ్ రావాలని ఆశిస్తున్నాను, కానీ అంతకన్నా ముందు మనం మన ఇంటిని చక్కదిద్దుకోవాలి. యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా చూడాలి, శాంతిభద్రతలను కాపాడాలి, అవినీతిని అంతం చేయాలి, పోలీసులను, సివిల్ అధికార యంత్రాంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉండేలా చేయాలి, కూలీలు, రైతులు రుణ భారంతో ఆత్మహత్యలు చేసుకోకుండా నిరోధించాలి, న్యాయమైన పరిపాలనను అందించాలి’’ అని ట్విటర్ వేదికగా సలహా ఇచ్చారు. 


Updated Date - 2022-04-10T16:42:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising