ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ సీఎం రెండు సీట్లలో పోటీ

ABN, First Publish Date - 2022-01-31T01:22:31+05:30

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ పార్టీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీని రెండు నియోజకవర్గాల్లో పోటీకి నిలిపింది. బదౌర్, చాంకౌర్ సాహిబ్ నియోజకవర్గాల నుంచి చన్నీని బరిలోకి దింపింది. పాటియాలా మాజీ మేయర్ విష్ణు శర్మను పాటియాలా అసెంబ్లీ నియోజవర్గం అభ్యర్థిగా ప్రకటించింది. పాటియాలా నుంచి మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌తో విష్ణు శర్మ‌ తలపడనున్నారు.


కాగా, కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ కుమారుడు మనీష్ బన్సాల్‌ను బర్నాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పోటీలోకి దింపింది. జలాబాద్ నుంతి మోహన్ సింగ్ ఫలియన్‌వాలా పోటీ చేయనున్నారు. ఈయన శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌తో తలపడనున్నారు. ఖెమ్ కరణ్ నియోజకవర్గం నుంచి సుక్పాల్ సింగ్ భుల్లర్, అట్టారి (ఎస్‌సీ) సీటు నుంచి తర్సెం సింగ్ సైల, నవాన్‌షహర్ నుంచి సత్బీర్ సింగ్ సైని, లూథియానా నుంచి ఐశ్వర్‌జోత్ సింగ్ చీమా పోటీలోకి దిగుతున్నారు.

Updated Date - 2022-01-31T01:22:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising