ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా అభ్యర్థుల అంశంలో కాంగ్రెస్ డబుల్ స్టాండ్

ABN, First Publish Date - 2022-01-19T01:00:42+05:30

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళలకు 40 శాతం టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా మహిళలు లక్ష్యంగా హామీలు ప్రకటించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాజకీయాల్లో మహిళలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారనే విషయం తెలిసిందే. అందుకే మహిళలు మిగిలిన రంగాల్లో కూడా ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం సాధించలేకపోయారు. ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టినప్పటికీ చట్ట సభల్లో మహిళలు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు అది ఆమోదం పొందలేకపోయింది. అయితే ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యంపై కొంతకాలంగా విస్తృత చర్చ కొనసాగుతోంది. 2019 సాదారణ ఎన్నికల్లో కూడా ఈ చర్చ కొంత మేరకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరిగింది. ఆ ఫలితమే బెంగాల్‌లో మమత బెనర్జీ పెద్ద మొత్తంలో మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. 40 శాతానికి పైగానే టీఎంసీ అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇక బీజేపీ సైతం 36 శాతం మహిళలకు టికెట్లు కేటాయించింది. కానీ ఏ పార్టీ మహిళలకు 10-15 శాతానికి మించి టికెట్లు ఇవ్వలేదు. కొన్ని పార్టీలైతే 10 శాతం లోపే టికెట్లు ఇచ్చాయి.


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళలకు 40 శాతం టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా మహిళలు లక్ష్యంగా హామీలు ప్రకటించారు. యూపీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి అడుగు మహిళలను ఆకట్టుకునే విధంగా వేస్తున్నారు. అయితే, యూపీలో మహిళా జపం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్‌లో ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 10 శాతమే టికెట్లు కేటాయించారు. రెండు సమీప రాష్ట్రాల్లో అదీ ఒకే సమయంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండ్‌లో ఉందని నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2022-01-19T01:00:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising