ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుల, మతాంతర వివాహాల వివరాల సేకరణకు కమిటీ

ABN, First Publish Date - 2022-12-15T03:04:34+05:30

శ్రద్ధావాకర్‌ హత్య తరహా ఘటనలు పునరావృతం కాకూడదనే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రద్ధ హత్య నేపథ్యంలో మహారాష్ట్ర నిర్ణయం

ముంబై, డిసెంబరు 14 : శ్రద్ధావాకర్‌ హత్య తరహా ఘటనలు పునరావృతం కాకూడదనే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న జంటల వివరాల సేకరణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇలాంటి వివాహాలు చేసుకున్న మహిళలు.. తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంటే వారి కుటుంబ వివరాలను కూడా కమిటీ సేకరిస్తుంది. ఈ తరహా వివాహాలు చేసుకున్న మహిళలకు తమ కుటుంబంతో సంబంధం తెగిపోకుండా ఉండేందుకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ఆయా జంటలను పర్యవేక్షిస్తూ అవసరమైన వారికి కౌన్సెలింగ్‌లు నిర్వహించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తుంది. కుల/మతాంతర వివాహాలు- కుటుంబ సహకార కమిటీ పేరిట ఏర్పాటైన ఈ రాష్ట్ర స్థాయి కమిటీ.. మంత్రి మంగళ్‌ ప్రభాత్‌ లోధా నేతృత్వంలో పని చేయనుంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంగళవారమే జారీ చేసింది. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న మహిళలు, వారి కుటుంబాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ ఓ వేదిక అని అందులో పేర్కొంది. వివిధ రంగాలకు చెందిన 13 మంది కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది.

Updated Date - 2022-12-15T03:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising