ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: ‘కామన్‌వెల్త్‌’ విజేతలకు, కోచ్‌లకు నజరానా

ABN, First Publish Date - 2022-08-17T14:10:45+05:30

బ్రిటన్‌లో జరిగిన 22వ కామన్‌వెల్త్‌ క్రీడా పోటీల్లో భారతజట్టు తరఫున పాల్గొని పతకాలు కైవసం చేసుకున్న క్రీడాకారులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                 - రూ.4.31 కోట్ల నగదు ప్రోత్సాహకాలు


చెన్నై, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): బ్రిటన్‌లో జరిగిన 22వ కామన్‌వెల్త్‌ క్రీడా పోటీల్లో భారతజట్టు తరఫున పాల్గొని పతకాలు కైవసం చేసుకున్న క్రీడాకారులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. సచివాలయంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్రీడాకారులతోపాటు వారి కోచ్‌లకు మొత్తం రూ.4.31 కోట్ల మేర నగదు ప్రోత్సాహకాలను అందజేసి సత్కరించారు. కామెన్‌వెల్త్‌ క్రీడాపోటీల్లో టేబుల్‌ టెన్నిస్(Table tennis)లో మూడు స్వర్ణపతకాలు, ఓ రజతం గెలుచుకున్న ఆచంట శరత్‌కమల్‌కు రూ.1.80 కోట్లు, ఇదే విధంగా టేబుల్‌ టెన్ని్‌సలో స్వర్ణ, రజత, కాంస్యం మూడు పతకాలు గెలుచుకున్న జి సత్యన్‌కు రూ.కోటి, స్క్వాష్‌ పోటీల్లో రెండు కాంస్య పతకాలు గెలుచుకున్న సౌరవ్‌  కోశల్‌కు రూ.40 లక్షలు, అదే పోటీలో ఓ కాంస్యపతకాన్ని గెలుచుకున్న దీపికా పల్లికల్‌కు రూ.20 లక్షలు, ఈ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన కోచ్‌లు ఐదుగురికి రూ.51లక్షలు చొప్పున నగదు పురస్కారాల చెక్కులను ముఖ్యమంత్రి అందించి అభినందించారు. ఇదేవిధంగా కామన్‌వెల్త్‌ కత్తిసాము ఛాంపియన్‌షిప్(Championship) పోటీల్లో స్వర్ణ, కాంస్యపతకాలు గెలుచుకున్న భవానీదేవికి రూ.35 లక్షలు, ఇండియన్‌ గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ గెలుచుకున్న ప్రణవ్‌ వెంకటేష్‏కు రూ.5లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన క్రీడా సంక్షేమ శాఖల మంత్రి శివ వి.మెయ్యనాధన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, యువజన సంక్షేమం క్రీడాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ అపూర్వ, రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ మెంబర్‌ సెక్రటరీ డాక్టర్‌ కేపీ కార్తికేయన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T14:10:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising