ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాబోయే మూడు,నాలుగు రోజులపాటు చలిగాలులు...imd హెచ్చరిక

ABN, First Publish Date - 2022-01-27T13:58:45+05:30

ఢిల్లీతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి మూడు, నాలుగు రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి మూడు, నాలుగు రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది.రాబోయే 3-4 రోజుల పాటు ఢిల్లీ, వాయువ్య, మధ్య భారతదేశంలో చలిగాలులు తీవ్రమవుతాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. జనవరి 26వతేదీ తర్వాత ఢిల్లీలో చలి తీవ్రత పెరుగుతుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే జెనామణి అంచనా వేశారు. ఫిబ్రవరి 2 వతేదీ వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానాలలో వర్షాలు కురిసే అవకాశం లేదని ఆర్కే జెనామణి తెలిపారు. పలు  ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 15-17 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. జనవరి 26 తర్వాత ఢిల్లీలో చలిగాలులు తీవ్రమవుతాయని జెనామణి పేర్కొన్నారు.


మధ్యప్రదేశ్‌తో సహా వాయువ్య, మధ్య భారతదేశం రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో చలి తీవ్రత పెరుగుతోందని ఐఎండీ తన వెదర్ బులెటిన్‌లో తెలిపింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఢిల్లీలోని అన్ని వాతావరణ కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 10 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి.వాయువ్య భారతదేశంలో వచ్చే ఐదు రోజుల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో కొన్ని ప్రాంతాల్లో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, సిక్కిం, మేఘాలయ, త్రిపురలలో వచ్చే రెండు మూడు రోజులలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.


 మైదాన ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గితే చలిగాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది.జార్ఖండ్, పశ్చిమ బెంగాల్,ఒడిశాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల్లో అండమాన్,  నికోబార్ దీవుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.


Updated Date - 2022-01-27T13:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising