ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2050 కల్లా భారత తీరప్రాంత నగరాలు జలమయం

ABN, First Publish Date - 2022-04-19T08:09:36+05:30

ముంబై, చెన్నై, వైజాగ్‌, కొచి, మంగ ళూరు, తిరువనంతపురం వంటి ప్రధాన వాణిజ్య నగరాలు 2050కల్లా మాయం కానున్నా యా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైజాగ్‌, చెన్నై, ముంబై, కోచి మాయం?

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: ముంబై, చెన్నై, వైజాగ్‌, కొచి, మంగ ళూరు, తిరువనంతపురం వంటి ప్రధాన వాణిజ్య నగరాలు 2050కల్లా మాయం కానున్నా యా? సముద్ర జలాల్లో కలిసిపోనున్నాయా? అవుననే అంటోంది ఆర్‌ఎంఎ్‌సఐ అనే సంస్థ. సముద్ర మట్టాల్లో పెరుగుదల వల్ల భారత్‌లోని తీర ప్రాంత నగరాల్లో చాలా వరకూ జలమయమైపోతాయని విశ్లేషణలో తేలినట్లు ఈ సంస్థ తెలిపింది. ‘‘ఉత్తర హిందూ మహాసముద్రంలో 1874-2004 మధ్యకాలంలో పెరుగుదల 1.06 మిల్లీమీటర్ల నుంచి 1.75 మిల్లీమీటర్ల మధ్యలో ఉంది. అయితే.. గత రెండున్నర దశాబ్దాల్లో మాత్రం 3.3 మిల్లీమీటర్లకు పెరిగింది. సముద్ర మట్టాల పెరుగుదల మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలతో తీర ప్రాంతాలు తీవ్ర తుఫాన్లు, భారీ వర్షాలను ఎదుర్కొంటున్నాయి. భారత పశ్చిమ తీరాన తుఫాన్లు 4 దశాబ్దాల్లో 52ు పెరిగాయి. 2050కల్లా ప్రపంచ ఉష్ణోగ్రతలు 2ు పెరుగుతాయని అంచనా. తుఫాన్లు, భారీ వర్షాలు మరింతగా పెరుగుతాయి. తీరప్రాంతాలను ఇది తీవ్ర ప్రమాదంలో నెడుతుంది. ముంబైలో సముద్ర మట్టాల పెరుగుదలతో 998 భవనాలు, 24 కిలోమీటర్ల మేర రహదారులు, చెన్నైలో 5 కిలోమీటర్ల మేర రహదారులు, 55 భవనాలు, కొచిలో 464 భవనాలు, తిరువనంతపురంలో 387 భవనాలు నీటిలో కలిసిపోతాయని అంచనా. విశాఖపట్నంలో 206 భవనాలు, 9 కిలోమీటర్ల మేర రహదారులు 2050కల్లా మునిగిపోతాయని మా అంచనా’’ అని ఆర్‌ఎంఎ్‌సఐ వెల్లడించింది. 

Updated Date - 2022-04-19T08:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising