ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొగ్గు స్కాంలో మాజీ కార్యదర్శి గుప్తాకు మూడేళ్ల జైలు

ABN, First Publish Date - 2022-08-09T06:40:44+05:30

యూపీఏ-1 హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణంలో అప్పటి కేంద్ర బొగ్గుగనుల శాఖ కార్యదర్శి హెచ్‌.సి.గుప్తాకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. లోహరా ఈస్ట్‌ కోల్‌ బ్లాక్‌ను గ్రేస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మరో ఇద్దరికి కూడా శిక్షలు ఖరారు


న్యూఢిల్లీ, ఆగస్టు 8: యూపీఏ-1 హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణంలో అప్పటి కేంద్ర బొగ్గుగనుల శాఖ కార్యదర్శి హెచ్‌.సి.గుప్తాకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. లోహరా ఈస్ట్‌ కోల్‌ బ్లాక్‌ను గ్రేస్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌(జీఐఎల్‌)కు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వాన్ని ఆయన మోసగించారని నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ప్రాసిక్యూషన్‌ అందజేసిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలతో ఏకీభవించిన సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి అరుణ్‌ భరద్వాజ్‌.. సోమవారం గుప్తాకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించారు. ఆయనతోపాటు.. అప్పట్లో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన కేఎస్‌ క్రొఫాకు రెండేళ్లు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా..


మరో నిందితుడు ముఖేశ్‌ గుప్తాకు నాలుగేళ్ల ఖైదు, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జీఐఎల్‌ కంపెనీకి రూ.2 లక్షల జరిమానాను విధించారు. కాగా.. బొగ్గు కుంభకోణంలో కేంద్రానికి మొత్తం రూ. 1.86 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ ఇప్పటికే కోర్టుకు ఆధారాలు సమర్పించింది. అప్పట్లో మంజూరు చేసిన 214 బొగ్గు బ్లాక్‌లను గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-08-09T06:40:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising