ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: కేరళ సీఎంతో స్టాలిన్‌ భేటీ

ABN, First Publish Date - 2022-09-03T15:35:21+05:30

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళ రాజధాని తిరువనంతపురానికి శుక్రవారం ఉదయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                              - జల వివాదాలపై చర్చ


చెన్నై, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళ రాజధాని తిరువనంతపురానికి శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్ళారు. శనివారం ఉదయం జరుగనున్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌(Kerala Chief Minister Pinarayi Vijayan)ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ముల్లై పెరియార్‌ డ్యామ్‌, నెయ్యారు. సిరువాణి జలాశయాలకు సంబంధించిన వివాదాలపై సమగ్రంగా చర్చలు జరిపారు. ఈ జలవివాదాలపై ఇదివరకే రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు పలు విడతలుగా సమావేశమై చర్చలు నిర్వహించారు. ఆ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల వివాదాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఓనం పండుగ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో  స్టాలిన్‌ పాల్గొన్నారు. రాత్రి తిరువనంతపురంలోనే ఆయన బసచేశారు. శనివారం ఉదయం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరై, రాత్రి ఏడు గంటలకు విమానంలో బయలుదేరి చెన్నై చేరుకుంటారు.

Updated Date - 2022-09-03T15:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising