ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిచ్చర పిడుగులకు సీఎం సత్కారం

ABN, First Publish Date - 2022-04-23T16:44:02+05:30

ఎనిమిదో తరగతి చదువుతూ తమిళభాషపై పట్టు సాధించిన కవలలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ నగదుతో సత్కరించి అభినందించారు. తేని జిల్లా మరవపట్టి గ్రామానికి చెందిన సెందమిళ్‌ శాలిని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                            - కవలలకు నగదు పురస్కారం


చెన్నై: ఎనిమిదో తరగతి చదువుతూ తమిళభాషపై పట్టు సాధించిన కవలలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ నగదుతో సత్కరించి అభినందించారు. తేని జిల్లా మరవపట్టి గ్రామానికి చెందిన సెందమిళ్‌ శాలిని, ముత్తమిళ్‌ సామిని అనే కవలలు పిన్నవయస్సులోనే తిరుక్కురళ్‌, తొల్‌కాప్పియం, తిరుప్పావై, తిరువెంబావై గ్రంథాలను కంఠస్థం చేసి పలు పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. జిల్లా స్థాయిలో జరిగిన తిరుక్కురళ్‌ పోటీలో ఈ బాలికలు ప్రథమ బహుమతిగా రూ.10వేలు గెలుచుకున్నారు. ఇటీవల జరిగిన ప్రపంచస్థాయి తొల్‌కాప్పియం పోటీల్లోనూ పాల్గొని ‘ప్రపంచ తొల్‌కాప్పియం రాయబారులు’ అవార్డులను అందుకున్నారు. ఆ చిన్నారుల ప్రతిభపాటవాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుక్రవారం ఉదయం వారిని సచివాలయానికి ఆహ్వానించి అభినందించారు. ఆ సందర్భంగా లక్ష రూపాయల చెక్కును బహుకరించగా, పాఠశాల విద్యాశాఖ తరఫున ఆ శాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ మరో లక్ష రూపాయల చెక్కు అందజేశారు. 

Updated Date - 2022-04-23T16:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising