ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రెండు తెగలను ఎస్టీ జాబితాలో చేర్చండి

ABN, First Publish Date - 2022-03-20T13:48:30+05:30

రాష్ట్రంలోని సంచార జాతి తెగలైన నరికూరవన్‌, కురివిక్కారన్‌ కులాల వారిని షెడ్యూల్‌ ట్రైబ్‌ (ఎస్టీ) జాబితాలో చేర్చాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - ప్రధానికి సీఎం స్టాలిన్‌ లేఖ


అడయార్‌(చెన్నై): రాష్ట్రంలోని సంచార జాతి తెగలైన నరికూరవన్‌, కురివిక్కారన్‌ కులాల వారిని షెడ్యూల్‌ ట్రైబ్‌ (ఎస్టీ) జాబితాలో చేర్చాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ లేఖ రాశారు. ఈ రెండు సంచార జాతులను ఎస్టీ జాబితాలో చేర్చడంపై జరుగుతున్న జాప్యాన్ని ప్రధాని దృష్టికి ఈ లేఖ ద్వారా సీఎం తీసుకెళ్ళారు. గత 2013లో కేంద్రానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇదే అంశంపై లేఖ రాసింది. ఆ తర్వాత ఈ రెండు తెగలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చేసిన ప్రతిపాదనను కూడా భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ కూడా సమ్మతించారు. అలాగే, లాకూర్‌ కమటీ, పార్లమెంట్‌ జాయింట్‌ కమిటీ కూడా గత 1965, 1967లో ఇదే తరహా సిఫార్సు చేసింది. కానీ, ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. తమిళనాడు రాష్ట్రంలో బాగా వెనుకబడిన వర్గ ప్రజలుగా ఉన్న ఈ రెండు సంచార జాతుల ప్రజలు అత్యంత దుర్భలమైన జీవితాన్ని గడుపుతున్నారని, ఈ రెండు తెగలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల భారత రాజ్యాంగం కల్పించిన రక్షణ, సంక్షేమ ఫలాలు పొందేందుకు వీలుపడుతుందన్నారు. అందువల్ల ఈ విషయంపై దృష్టిసారించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాని మోడీకి రాసిన లేఖలో సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-20T13:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising