ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి అవకాశాలు పెంచండి

ABN, First Publish Date - 2022-06-03T14:47:30+05:30

రాష్ట్రంలో విద్యావంతులైన యువతకు ఆయా శాఖల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని, గ్రామీణ ప్రజలకు ప్రత్యేకించి పేద, మధ్యతర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కనీస వసతులపై దృష్టిసారించండి 

- సమీక్షా సమావేశంలో సీఎం స్టాలిన్‌


చెన్నై, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యావంతులైన యువతకు ఆయా శాఖల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని, గ్రామీణ ప్రజలకు ప్రత్యేకించి పేద, మధ్యతరగతి వర్గాల వారికి కనీస సదుపాయాలందించేందుకు పాటుపడాలని వివిధ ప్రభుత్వ శాఖాధిపతులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచించారు. డీఎంకే ప్రభుత్వం యేడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ శాఖల పనితీరుపై రెండు రోజులు సమీక్షా సమావేశాలు సచివాలయం సమీపం నామక్కల్‌ కవింజర్‌ మాళిగైలో రెండో రోజైన గురువారం కూడా జరిగాయి. ఆదిద్రావిడ సంక్షేమం, వ్యవసాయ, పశుసంవర్థక, బీసీ, మైనారీటీ సంక్షేమం సహా 19 శాఖల పనితీరుపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆయా శాఖాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు స్వాగతోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రసంగిస్తూ ఏడాది పాలనలో కరోనా వ్యాప్తి, వరదలు, ఆర్థిక సంక్షోభం ఇలా ఎన్నో సమస్యలు ఎదురైనా వాటన్నింటిని అధికారుల సహకారాలతో సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామని పేర్కొన్నారు. గాడి తప్పిన ఆర్థిక పరిస్థితిని సక్రమంలో పెట్టేందుకు తీవ్రంగా కృషిచేసామని, అదే సమయంలో ప్రజలకు ఉన్నతమైన విద్య, వైద్య సదుపాయాలను అందించడానికి ఏమాత్రం వెనుకంజ వేయలేదన్నారు. ముఖ్యంగా వైద్య, విద్య, వ్యవసాయ రంగాల్లో ఉన్నతమైన ఫలితాలు సాధించేందుకు శాఖాధికారులు తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక రంగానికి సంబంధించినంతవరకూ పెట్టుబడులను సమీకరించామని, ఎన్నో సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆయా శాఖాధికారులు మౌలిక సదుపాయాలు అందించడానికి, వీలైనంత త్వరగా లైసెన్సులు మంజూరు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలకు లభించే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతు బజార్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.  

Updated Date - 2022-06-03T14:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising