ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రచారానికి వెళ్లని Stalin

ABN, First Publish Date - 2022-02-23T13:25:06+05:30

రాష్ట్రంలో అధికారం చేపట్టిన 9 నెలల తరువాత జరిగిన ఎన్నికల కావడంతో వీటిని డీఎంకే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాత్రం ఈ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. తన నివాసంలోనే ఉండే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - అన్నీ తానై నడిపిన ఉదయనిధి


చెన్నై: రాష్ట్రంలో అధికారం చేపట్టిన 9 నెలల తరువాత జరిగిన ఎన్నికల కావడంతో వీటిని డీఎంకే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాత్రం ఈ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. తన నివాసంలోనే ఉండే వ్యూహంరచించిన స్టాలిన్‌.. ఒక్కో జిల్లా నేతలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిం చారు తప్ప, ఎక్కడా నేరుగా ప్రచారానికి వెళ్ల లేదు. దీంతో ఈ ప్రభావం తమ ఓట్లపై పడుతుందే మోనని కొంతమంది నేతలు ఆందోళన చెందారు. కానీ స్టాలిన్‌ నగరంలో ఉండే చేసిన వ్యూహరచన, డీఎంకే ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై వ్యక్తమవుతున్న సంతృప్తి వెరసి ఆ పార్టీకి నగరాలు, పట్టణాల్లో తిరుగులేని విజయం కట్టబెట్టాయి.


అన్నీ తానై నడిపిన ఉదయనిధి

తన తండ్రి, సీఎం స్టాలిన్‌ ప్రచారానికి వెళ్లకపోయినా డీఎంకే యువనేత ఉదయనిధి దీనిని సవాల్‌గా స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అన్నీ తానై సారధ్యం వహించారు. సీనియర్ల సాయంతో, ఇతర నేతలను సమన్వయపరచుకుంటూ, అభ్యర్థుల ప్రచారాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ఉదయనిధి కీలక పాత్ర పోషించారు. తన సొంత నియోజకవర్గమైన చేపాక్‌కు కొన్నాళ్లు దూరంగా వున్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు. ఆయన వాడిన వాడి, వేడి పదజాలం ఓటర్లను బాగా ఆకర్షించిందని, ఆ ప్రభావం ఈ ఫలితాల్లో కనిపించిందని డీఎంకే శ్రేణులు ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి.

Updated Date - 2022-02-23T13:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising