ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశాల నుంచి దిగుమతయ్యే వైరస్‌ వ్యాప్తి నిరోధించడం ఎలా?

ABN, First Publish Date - 2022-03-23T14:23:07+05:30

ఓ వైపు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు ఈ నెలాఖరున ముగియనుండటం, మరో వైపు ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానుండటంతో కరోనా వైరస్‌ వ్యాప్తిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - వైద్యులతో స్టాలిన్‌ సమీక్ష


చెన్నై: ఓ వైపు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు ఈ నెలాఖరున ముగియనుండటం, మరో వైపు ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానుండటంతో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ దృష్టి సారించారు. ప్రత్యేకించి రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా కట్టడిలోకి వస్తున్న సమయంలో విదేశాల నుంచి వచ్చే వారి కారణంగా వైరస్‌ వ్యాప్తి అధికమయితే ఏం చేయాలన్న విషయంపై వైద్యనిపుణులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం ఉదయం సచివాలయంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌, వైద్యనిపుణులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం అమెరికా, చైనా తదితర దేశాల్లో మళ్ళీ కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చుతుండటంతో ఆ దేశాల నుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికుల ద్వారా రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి అధికమయ్యే అవకాశాలున్నాయని ఆ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై వైద్యనిపుణుల సూచనలను స్టాలిన్‌ కోరారు. గతంలా కొవిడ్‌ నిబంధనలను కఠినంగా పాటించాలని, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా కొవిడ్‌ ముందస్తు వైద్యపరీక్షలను జరపాలని, వైరస్‌ లక్షణాలున్నవారిని ఐసోలేషన్‌కు పంపాలని వైద్యనిపుణులు సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా నిరోధించేందుకు సహాయ సహకారాలందించిన వైద్యనిపుణులకు, కరోనా బాధితులకు చికిత్స అందించి మరణాల సంఖ్యను తగ్గించిన వైద్యులకు స్టాలిన్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-03-23T14:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising