ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రమశిక్షణ తప్పితే నియంతలా మారతా: సీఎం

ABN, First Publish Date - 2022-07-05T12:49:43+05:30

నేతలు క్రమశిక్షణ తప్పితే, హద్దుమీరి ప్రవర్తిస్తే తాను నియంతలా మారాల్సి ఉంటుందని, అదే జరిగితే పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నేతలు క్రమశిక్షణ తప్పితే, హద్దుమీరి ప్రవర్తిస్తే తాను నియంతలా మారాల్సి ఉంటుందని, అదే జరిగితే పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ హెచ్చరించారు. సోమవారం నామక్కల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. తాను మరీ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నట్లు తన సన్నిహితులు చెబుతున్నారని, ప్రజాస్వామ్యయుతం అంటే అందరూ చెప్పేది వినడం, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించడమేనన్నారు. కానీ కొంతమంది మాత్రం ప్రజస్వామ్యమంటే మరోలా భావిస్తున్నారన్నారు. ఎవరైనా, ఏదైనా చేయవచ్చని తలస్తున్నారన్నారు. కానీ తాను మాత్రం అలా భావించడం లేదన్నారు. నేతల్లో క్రమశిక్షణారాహిత్యం, హద్దుమీరి ప్రవర్తించడం వంటివి కనిపిస్తే తాను ఖచ్చితంగా నియంతలా మారతానని, ఆ మేరకే కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సివుంటుందని హెచ్చరించారు. తాను కేవలం స్థానిక సంస్థల నేతలను ఉద్దేశించి మాత్రమే చెప్పడం లేదని, ఇది పార్టీలోని నాయకులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అందరూ చట్టం ప్రకారం నడచుకుంటూ, ప్రజల కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివుంటుందని హెచ్చరించారు. మహిళా నేతలు తమ పదవులకు సంబంధించిన అధికారాలను తమ భర్తలకు అప్పగించరాదని, రాజ్యాంగం ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలకు తామే బాధ్యులుగా ఉండాలని సీఎం హితవు పలికారు. 

Updated Date - 2022-07-05T12:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising