ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM statement: పంట రుణాల రద్దు

ABN, First Publish Date - 2022-08-31T13:53:15+05:30

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి ప్రజలకు ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి(Chief Minister N. Rangaswamy) వరాలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జన్యులోప చిన్నారులకు నెలనెలా రూ.1000 

- భవన కార్మిక సంక్షేమ బోర్డు సభ్యులపై వరాల జల్లు

- ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు 

- అసెంబ్లీలో పుదుచ్చేరి సీఎం ప్రకటన


పుదుచ్చేరి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి ప్రజలకు ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి(Chief Minister N. Rangaswamy) వరాలు గుప్పించారు. 2022లో సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రూ.13.80 కోట్ల పంట రుణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో బడ్జెట్‌ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా మంగళవారం సీఎం మాట్లాడుతూ... ఎమ్మెల్యేల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తానన్న రంగస్వామి వారిని సంతృప్తిపరిచేలా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జన్యులోపం కలిగిన పిల్లల పోషణకు నెలనెలా రూ.1,000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేగాక భవన కార్మిక సంక్షేమ బోర్డు(Building Labor Welfare Board) సభ్యుల పిల్లలకూ వరాలు ప్రకటించారు. ఆ సభ్యుల పిల్లలు 1 నుంచి 8వ తరగతి వరకు చదివేవారికి ఏడాదికి రూ.1,000, 9,10 తరగతుల వారికి రూ.1,500, ప్లస్‌ వన్‌, ప్లస్‌టూ తరగతులకు రూ.2 వేలు ఇస్తామన్నారు. జాలర్లకు లీటరు డీజిల్‌పై రూ.12 రాయితీ, భవన సంక్షేమ బోర్డు అందిస్తున్న వివాహ ఆర్ధికసాయం రూ.7 వేల నుంచి రూ.15 వేలకు, అంత్యక్రియలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. అంతేకుండా వారికి వైద్యం కోసం ఇచ్చే రూ.500లను రూ.2 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. హృద్రోగ సమస్యలున్న భవన సంక్షేమబోర్డు సభ్యులకు రూ.లక్ష, కిడ్నీ సమస్యలున్న వారికి రూ.50 వేలు ఇస్తామని తెలిపారు. పుదుచ్చేరిలోని ఆటోడ్రైవర్ల సంక్షేమ కోసం ప్రత్యేకంగా ‘ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేస్తామన్నారు. అంతేగాక ఇటీవల పేర్కొన్నట్లుగా 70 నుంచి 80 ఏళ్ల వారి పింఛన్‌ను రూ.3 వేలకు పెంచుతామన్నారు. పారిశుధ్య కార్మికులను ఇకపై పారిశుధ్య కార్మికులుగా వ్యవహరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలు స్వయం వృత్తులు చేపట్టేలా 100 శాతం రాయితీతో ‘ఈ-ఆటోలు’లు అందిస్తామని రంగస్వామి అసెంబ్లీలో ప్రకటించారు.

Updated Date - 2022-08-31T13:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising