ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Durga Stalin: కుంభాభిషేకంలో సీఎం కుటుంబసభ్యులు

ABN, First Publish Date - 2022-09-06T15:42:24+05:30

శీర్గాళి సమీపంలోని కీళపెరుంపల్లం అరుళ్‌మిగు అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయ కుంభాభిషేకం, ముఖ్యమంత్రి సతీమణి దుర్గా స్టాలిన్‌(Durga

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 5: శీర్గాళి సమీపంలోని కీళపెరుంపల్లం అరుళ్‌మిగు అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయ కుంభాభిషేకం, ముఖ్యమంత్రి సతీమణి దుర్గా స్టాలిన్‌(Durga Stalin), కుటుంబసభ్యులు సెన్‌తామరై, శబరీశన్‌ సమక్షంలో జరిగింది. మైలాడుదురై జిల్లాలో ప్రసిద్ధిచెందిన ఈ ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయ జీర్ణోద్ధరణ పనులు దుర్గా స్టాలిన్‌ విరాళంతో ఇటీవల పూర్తవడంతో కుంభాభిషేకం నిర్వహించారు. ముందుగా దుర్గా స్టాలిన్‌(Durga Stalin), కుమార్తె సెన్‌తామరై, అల్లుడు శబరీశన్‌, సీఎం బావమరిది డా.రాజమూర్తి, ఆయన కుటుంబసభ్యులు పుణ్యజలాల కలశాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం విమాన కలశం, రాజగోపురం, పరివార దేవతల సన్నిధి వద్దకు కలశాలు చేర్చగా, దుర్గా స్టాలిన్‌ పచ్చ జెండా ఊపడంతో శివచార్యులు పుణ్యజలాలు ప్రోక్షించి కుంభాభిషేకం నిర్వహించారు. వేడుకల్లో పర్యావరణ, యువజన సంక్షేమ శాఖ మంత్రి మెయ్యినాధన్‌, పుంపుహార్‌ ఎమ్మెల్యే నివేదా మురుగన్‌, శీర్గాళి ఎమ్మెల్యే పన్నీర్‌సెల్వం, జిల్లా కలెక్టర్‌ లలిత, ఎస్పీ నిషా, పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-06T15:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising