ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ సీఎం చన్నీ రెండు సీట్లలో పోటీ

ABN, First Publish Date - 2022-01-14T13:52:45+05:30

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారుపై ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చ జరిపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

70 మందికి పైగా అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా రెడీ

న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారుపై ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చ జరిపింది.పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా త్వరలో విడుదల కానుంది. పంజాబ్ అసెంబ్లీలో చమ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. పంజాబ్ రాష్ట్రంలో 70 మందికి పైగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. ఖరారైన జాబితాలో పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారని సమాచారం. మరో దపా సీఈసీ సమావేశమై శుక్రవారం కాంగ్రెస్ తొలిజాబితా ప్రకటించే అవకాశం ఉంది. పంజాబ్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లోని రెండు స్థానాల నుంచి ప్రస్తుత పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని పోటీకి దింపేందుకు కాంగ్రెస్ ఆసక్తిగా ఉన్నట్లు కాంగ్రెస్‌లోని ఉన్నత వర్గాలు తెలిపాయి.


పంజాబ్‌లోని మాఝా ప్రాంతంలో వచ్చే చమ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానంతో పాటు, నిర్ణయాత్మక కారకంగా ఉన్న దళితుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్న దోబా ప్రాంతంలోకి వచ్చే అడంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం చన్నీని పోటీకి దింపేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని సోనియాగాంధీ కోరితే తాను బరిలోకి దిగుతానని కాంగ్రెస్ ఎంపీ జస్పీర్ సింగ్ గిల్ చెప్పారు.ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా తన పదవీకాలం మార్చితో ముగియనున్నందున అతన్ని అసెంబ్లీ బరిలోకి దించుతారని ఓ కాంగ్రెస్ నేత చెప్పారు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీని సాధించింది.


Updated Date - 2022-01-14T13:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising