ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cm నిస్సహాయత.. ఆన్‌లైన్‌ గేమ్‌ల నియంత్రణకు కోర్టు అడ్డంకి

ABN, First Publish Date - 2022-03-15T17:45:51+05:30

ఆన్‌లైన్‌ గేమ్‌ల నియంత్రణకు చట్టం తీసుకొచ్చినా కోర్టు స్టే ఇచ్చిన విషయమై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నిస్సహాయత వ్యక్తం చేశారు. శాసనసభలో సోమవారం బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆన్‌లైన్‌ గేమ్‌లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఆన్‌లైన్‌ గేమ్‌ల నియంత్రణకు చట్టం తీసుకొచ్చినా కోర్టు స్టే ఇచ్చిన విషయమై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నిస్సహాయత వ్యక్తం చేశారు. శాసనసభలో సోమవారం బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆన్‌లైన్‌ గేమ్‌లకు సంబంధించి కాంగ్రెస్‌ సభ్యులు రమేశ్‌కుమార్‌ ప్రస్తావించిన అంశాలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. సోషియల్‌ క్లబ్‌గా ఏర్పాటు చేస్తారని, ఆ తర్వాత గ్యాంబ్లింగ్‌ కేంద్రంగా మారిపోతోందన్నారు. పేరుకు మాత్రమే సోషియల్‌ క్లబ్‌లని విచారం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఈ విధానం పెరిగిందన్నారు. పోలీసులు దాడులు చేస్తే మరుసటి రోజే బెయిల్‌పై బయటకు వస్తారన్నారు. రోజుకు 20-30 లక్షల రూపాయల దాకా గ్యాంబ్లింగ్‌ సాగుతుందని, చట్టంలో రూ.500 మాత్రమే జరిమానా ఉంటుందన్నారు. ఇంతకాలం సాగిన విధానాలలో మార్పులు తీసుకురావాలని కొత్తచట్టం తీసుకొచ్చామని, కానీ ఏళ్ల తరబడి గ్యాంబ్లింగ్‌ కేంద్రాలు జరిపేవారు అడ్డదారులలో వెళుతున్నారన్నారు. ఈ దందాతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నా ఏం చేయలేమన్నారు. హోంశాఖ మంత్రి, న్యాయవ్యవహారాలశాఖ మంత్రితో చర్చలు జరిపి కాగ్నిజబుల్‌ అఫెన్స్‌గా నమోదు చేసి చట్టం చేశామన్నారు. గతంలో తరహా ఇందులో 500 జరిమానాతో పోలీస్ స్టేషన్‌లో బెయిల్‌ సాధ్యం ఉండేది కాదన్నారు. 3-5 ఏళ్ల జైలుశిక్ష ఉండేదన్నారు. ఆన్‌లైన్‌ జూదం భారీస్థాయిలో సాగుతోందని, ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యవహారమన్నారు. సమగ్రమైన చట్టాలు తీసుకురావడం ద్వారా మాత్రమే అరికట్టవచ్చునన్నారు. 

Updated Date - 2022-03-15T17:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising