ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్‌

ABN, First Publish Date - 2022-03-17T18:11:57+05:30

రాష్ట్ర అభివృద్ధిని ప్రగతిపథంలో తీసుకుపోయేలా బడ్జెట్‌ ప్రవేశపెట్టామని, సమాజంలోని అన్నివర్గాల సంక్షేమాన్ని కేంద్రీకృతం చేశామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై 


బెంగళూరు: రాష్ట్ర అభివృద్ధిని ప్రగతిపథంలో తీసుకుపోయేలా బడ్జెట్‌ ప్రవేశపెట్టామని, సమాజంలోని అన్నివర్గాల సంక్షేమాన్ని కేంద్రీకృతం చేశామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాలలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి బొమ్మై సమగ్ర వివరణ ఇచ్చారు. రెండు విడతలుగా ఆయన బడ్జెట్‌పై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రజల ఆర్థికతను పెంపొందించేలా బడ్జెట్‌ ఉందన్నారు. ఆహారం, మౌలిక సదుపాయాలు, సామాజిక ప్రగతి, విద్య, ఉద్యోగాలు, దారిద్య్రరేఖ నుంచి ప్రగతివైపు తీసుకెళ్లడం ఆర్థికత అవుతుందన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సుస్థిరం అయ్యేందుకు నాలుగేళ్లు అవసరమన్నారు. కొవిడ్‌ కాలంలో ఆర్థికం వెనుకబడినా ఇటీవల కొంత మెరుగు కావడం తో బడ్జెట్‌లోనూ మరిన్ని సంక్షేమాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సామాన్య వర్గాలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతోనే బడ్జెట్‌ ప్రవేశపెట్టామని, అ మృత యోజనతో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.75 కోట్లు, అ మృతనగరాభివృద్ధికి రూ.37కోట్లు, స్వయం సహాయకసంఘాలకు రూ. 75కోట్లు కేటాయించామన్నారు. నైపు ణ్య శిక్షణకు 38వేల మందిని ఎంపిక చేశామన్నారు. రైతుల్లో శక్తిని పెంపొందించే దిశగా రూ. 600 కోట్లతో డీజిల్‌, పెట్రోల్‌పై రాయితీ కల్పించామన్నారు. మిల్క్‌ డెవలె్‌పమెంట్‌ బ్యాంక్‌ను ప్రారంభించి పాల ఉత్పత్తిదారులకు సరళమైన విధానంతో రుణాలు ఇచ్చేందుకు రూ. 100 కోట్లు కేటాయించామన్నారు. ఈ ఏడాది కొత్త విద్యావిధానం తీసుకొచ్చినందున అందుకు అవసరమైన సౌలభ్యాలు పెంపొందింపచేయదలిచామన్నారు. పరిశోధనల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వదలిచామని, గ్రామీణ ప్రాంతాలను డిజిటలీకరణ చేశామన్నారు. గ్రీన్‌ బడ్జెట్‌ను తీసుకొచ్చామని, పర్యావరణానికి హాని కలిగే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వదలిచామన్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, రైతుకు ప్రోత్సాహం, మహిళలకు చేయూతకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉందన్నారు. 

Updated Date - 2022-03-17T18:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising