ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళన వద్దు.. Gst భారాన్ని తగ్గిస్తాం

ABN, First Publish Date - 2022-07-19T17:07:28+05:30

సామాన్య ప్రజలపై జీఎస్టీ భారం పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై భరోసా ఇచ్చారు. శాసనసభలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై 

- మధ్య తరగతి ప్రజలపై పెనుభారం: కాంగ్రెస్‌ 


బెంగళూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): సామాన్య ప్రజలపై జీఎస్టీ భారం పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై భరోసా ఇచ్చారు. శాసనసభలో సోమవారం పుట్టినరోజు సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవిని అభినందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్యాకింగ్‌ చేసిన పాలు, పెరుగుపై మాత్రమే జీఎస్టీ విధించామని, బ్రాండెడ్‌ పాలు, పెరుగుకు మాత్రమే ఇది వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. 5 శాతం పన్ను సాధారణ పాడిరైతులపై ఉండబోదన్నారు. పాడిరైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జీఎస్టీ విధించిన తర్వాత పాలు, పెరుగు ధరలను పెంచాల్సిన అవసరం లేదని యథావిధిగా అమ్ముకోవచ్చునని ఆయన పాడిరైతులకు సూచించారు. సామాన్యులు, నిరుపేదలు వినియోగించే పాడి ఉత్పత్తులపై జీఎస్టీ విధించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నేపథ్యంలో సీఎం ఈ మేరకు వివరణ ఇచ్చారు. బ్రాండెడ్‌, ప్యాక్‌ చేసిన పాలు, పెరుగుపై 5 శాతం జీఎస్టీని వాపసు పొందేవిధంగా జీఎస్టీ కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వ్యాపారులు జీఎస్టీ నియమాలను సరిగా అర్థం చేసుకోవాలని సీఎం సూచించారు. కొన్ని సందర్భాల్లో జీఎస్టీ చెల్లించినా వాపసు వస్తుందని వెల్లడించిన ఆయన ప్రజలపై భారం వేస్తే సహించేది లేదన్నారు. 

Updated Date - 2022-07-19T17:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising