ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటిలో ప్రభుత్వ జోక్యం ఉండదు: Cm

ABN, First Publish Date - 2022-02-19T17:52:23+05:30

రాష్ట్రంలో మదరసాలలో ప్రభుత్వ జోక్యం ఉండదని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. హైకోర్టులో హిజాబ్‌ వివాదం సాధ్యమైన త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. సచివాలయంలో శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పరీక్షల వేళ ఆందోళనలు సరికావు

- స్పష్టం చేసిన Cm Basavaraj


బెంగళూరు: రాష్ట్రంలో మదరసాలలో ప్రభుత్వ జోక్యం ఉండదని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. హైకోర్టులో హిజాబ్‌ వివాదం సాధ్యమైన త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిజాబ్‌ వివాదం కారణంగా హైస్కూళ్లు, పీయూసీ విద్యాసంస్థల్లో విద్యార్థుల విద్యార్జనకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతుండటం చాలా బాధగా ఉందన్నారు. పరీక్షల వేళ ఇలాం టి పరిణామాలు విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిణామమేనని వ్యాఖ్యానించారు. ఈ వివాదం సమసిపోయి విద్యాసంస్థల్లో మళ్లీ సాధారణ స్థితిగతులు నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థుల్లో సామరస్యం, ఐక్యత వెల్లివిరియాల్సి ఉందని, చిన్నారుల మనసులో విషం నింపడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లోనూ సాధ్యమైనంతవరకు ఈ వివాదం లేకుండా చూడాల్సిందిగా విద్యాశాఖాధికారులను ఆదేశించామన్నారు. మైనార్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. హిజాబ్‌కు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను 95 శాతం మంది విద్యార్థులు గౌరవించి అమలు చేస్తున్నారని, కేవలం 5 శాతం మంది విద్యార్థుల పట్టుదల కారణంగానే సమస్య జఠిలంగా మారిందని సీఎం వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లోగానీ, ప్రభుత్వ నిర్వహణలోని ఉర్దూ పాఠశాలల్లోగానీ మదరసావిద్యను బోదించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు నిర్వహణలోని మదరసాల ఆధునికీకరణకు, మౌలిక సదుపాయాల కల్పనకు తలా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు గ్రాంట్లను విడుదల చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన మదరసాలు 622 ఉన్నాయని, వీటికి మాత్రమే సాయం అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. మదరసాలకు సంబంధించినంత వరకు ముస్లింల మతపరమైన విద్యకు పూర్తిస్వేచ్ఛ ఉందని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోజాలరని సీఎం తెలిపారు. 

Updated Date - 2022-02-19T17:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising