ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిజర్వాయర్లకు వాయనం సమర్పించిన Cm

ABN, First Publish Date - 2022-07-21T17:24:10+05:30

నైరుతి రుతుపవనాల ప్రభావంతో జలకళను సంతరించుకుని పొంగిపొర్లుతున్న కృష్ణరాజసాగర, కబిని రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి బసవరాజ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల ప్రభావంతో జలకళను సంతరించుకుని పొంగిపొర్లుతున్న కృష్ణరాజసాగర, కబిని రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై బుధవారం వాయనం సమర్పించారు. అంతకుముందు ఆయన మైసూరు చాముండేశ్వరి అమ్మవారికి, కావేరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు అనంతరం సీఎం మీడియాకు చెప్పారు. కబిని వద్ద ప్రత్యేక ఉద్యానవనాన్ని నిర్మించాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దీన్ని నిర్మించాలా? పీపీపీ పద్ధతిలో నిర్మించాలా అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈసారి వర్షాలు సకాలంలో ప్రారంభమైన కారణంగా రాష్ట్రమంతటా నాట్లు ఉత్సాహభరిత వాతావరణం మధ్య జరుగుతున్నాయన్నారు. కేఆర్‌ఎస్‌ వాయనం సమర్పణ కార్యక్రమం కావేరి మాత విగ్రహం వద్ద ఏర్పాటు కాగా కబిని రిజర్వాయర్‌కు వాయన సమర్పణ కార్యక్రమం హెచ్‌డీ కోటె తాలుకా బీచనహళ్లి వద్ద జరిగింది. ఈ కార్యక్రమాల్లో సీఎం సతీమణి చన్నమ్మతో పాటు జలవనరుల శాఖ మంత్రి గోవింద కార్జోళ, మైసూరు జిల్లా ఇన్‌చార్జిమంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Updated Date - 2022-07-21T17:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising