ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంధువుల ఇళ్లల్లో ఉన్నా సరే.. రేషన్‌ పంపిణీ చేయండి

ABN, First Publish Date - 2022-07-13T16:21:18+05:30

కొడగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలి, ముందుజాగ్రత్తగా చాలామంది శిబిరాలు, గంజికేంద్రాలు, బంధువుల ఇళ్లల్లోనూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కొడగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలి, ముందుజాగ్రత్తగా చాలామంది శిబిరాలు, గంజికేంద్రాలు, బంధువుల ఇళ్లల్లోనూ తలదాచుకుంటున్నారని, వీరికి కూడా రేషన్‌ పంపిణీ చేయాలని సీఎం బొమ్మై సూచించారు. హారంగి రిజర్వాయర్‌ ప్రదేశంలో పూడికతీతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొడగు జిల్లాలోని నలుగురు తహసీల్దార్ల నిధుల్లో కోటి రూపాయల గ్రాంటు ఉందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో పది రోజుల అవధిలోనే 114 శాతం వర్షం కురిసిందన్నారు. జిల్లాలో 15 ఇళ్లు పూర్తిగా ను, 63 ఇళ్లు పాక్షికంగాను దెబ్బతిన్నాయన్నారు. కూలిన ఇళ్లకు రూ.5 లక్షలు, బాగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేల సాయం అందిస్తామని ప్రకటించిన సీఎం, తక్షణ సాయంగా రూ.50వేలు, సహాయసామగ్రిని అందచేస్తున్నామన్నారు. 

Updated Date - 2022-07-13T16:21:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising