ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెంపుల్‌ టూరిజంపై దృష్టి సారించండి

ABN, First Publish Date - 2022-02-24T18:05:25+05:30

రాష్ట్రంలో అత్యంత ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయని ప్రత్యేకించి ఉత్తర, దక్షిణ కర్ణాటక భాగాలు, కోస్తా తీరంలో టెంపుల్‌ టూరిజానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - అధికారులకు సీఎం పిలుపు  

- దైవ సంకల్పకు శ్రీకారం 


బెంగళూరు: రాష్ట్రంలో అత్యంత ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయని ప్రత్యేకించి ఉత్తర, దక్షిణ కర్ణాటక భాగాలు, కోస్తా తీరంలో టెంపుల్‌ టూరిజానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. నగరంలో బుధవారం ‘దైవ సంకల్ప’ పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. హిందూ ధార్మిక సంస్థలు, దేవదాయశాఖ నిర్వహణలోని ఆలయాల సమగ్ర నిర్వహణ కోసం ఈ ప్రత్యేక పథకాన్ని ఉద్దేశించారు. అన్ని హిందూ దేవాలయాలలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అతి తక్కువ అవధిలోనే ఇంటిగ్రేటెడ్‌ టెంపుల్‌ మేనేజిమెంట్‌ సిస్టమ్‌ (ఐటీఎంఎస్)ను అమలులోకి తెచ్చిన అధికారులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. దేవస్థానాలలో స్వచ్ఛతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దేవదాయశాఖ మంత్రి శశికళ జొల్లె, ఎమ్మెల్యే ఎస్‌ఏ రామదాస్‌, సీఎం ప్రధాన కార్యదర్శి మంజునాథ ప్రసా ద్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ రోహిణి సింధూరి హాజరయ్యారు. 

Updated Date - 2022-02-24T18:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising