ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: ఓడిన నియోజకవర్గాలపై దృష్టి సారిద్దాం..

ABN, First Publish Date - 2022-08-21T18:25:31+05:30

వచ్చే శాసనసభ ఎన్నికల వ్యూహాల రూపకల్పన సమావేశాలను బీజేపీ వరుసగా శనివారం కూడా కొన సాగించింది. మల్లేశ్వరంలోని పార్టీ ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                             - పార్టీ శ్రేణులకు సీఎం బసవరాజ్‌ బొమ్మై పిలుపు 


బెంగళూరు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): వచ్చే శాసనసభ ఎన్నికల వ్యూహాల రూపకల్పన సమావేశాలను బీజేపీ వరుసగా శనివారం కూడా కొన సాగించింది. మల్లేశ్వరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai), పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ పాల్గొన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఓడిన బీజేపీ అభ్యర్థులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్‌ యడియూరప్ప ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండోస్థానంలో నిలబడిన అభ్యర్థులు తమ ఓటమికి గల కారణాలను ఈ సమావేశంలో ఏక రువు పెట్టారు. మరోమారు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నేతలకు విన్నవించుకున్నారు. అయితే దీనిపై అధిష్ఠానమే తుది నిర్ణయం తీసు కుంటుందని సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి బొమ్మై పేర్కొన్నారు. కొద్ది పాటి తేడాతో చేజారిన శాసనసభ నియోజకవర్గాలను మళ్లీ చేజిక్కించు కునేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు. మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yeddyurappa) మాట్లాడుతూ కష్టపడి పనిచేసే నేతలు, కార్యకర్తలను తప్పకుండా పార్టీ గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. 70 మందికిపైగా పరాజిత బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-21T18:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising